వేగంగా జాతర ఏర్పాట్లు
పాపన్నపేట(మెదక్): ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న ఏడుపాయల జాతర పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగాదాయన మాట్లాడుతూ.. జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీ వాహనాల ద్వారా చెత్త తరలించాలని సూచించారు. తాగు నీటికి సంబంధించి మొదట ట్రయల్ రన్ నిర్వహించాలన్నారు. నల్లాలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ వేణు, ఆలయ ఈఓ వీరేశం ఇతర అధికారులు ఉన్నారు.
ప్రజావాణి వాయిదా
కలెక్టర్ రాహుల్‌రాజ్


