సమయపాలన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

సమయపాలన తప్పనిసరి

Feb 2 2026 8:13 AM | Updated on Feb 2 2026 8:13 AM

సమయపా

సమయపాలన తప్పనిసరి

టేక్మాల్‌(మెదక్‌): వైద్యులు సమయపాలన పాటించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని టేక్మాల్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రిని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులు, రోగుల గదులు, వైద్యుల హాజరుతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. ఈసందర్బంగా అందుబాటులో ఉన్న మందుల గురించి ఆరా తీశారు. డ్యూటీ డాక్టర్‌ ఎవరు? రాత్రి వేళలో ఎంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో ఉంటున్నారని అడిగి తెలుసుకున్నారు. అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణంలో వైద్యం అందించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

బహిరన్‌దిబ్బలో మద్య నిషేధం

అల్లాదుర్గం(మెదక్‌): మండలంలోని బహిరన్‌దిబ్బలో గ్రామస్తులు మద్య నిషేధం విధించారు. బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మకుండా తీర్మానం చేసి ఎస్‌ఐ శంకర్‌కు ప్రతిని అందజేశారు. ఈమేరకు ఆదివారం సర్పంచ్‌ పాంపాటి వీర న్న గ్రామస్తులతో సమావేశం నిర్వహించి నిర్ణ యం తీసుకున్నారు. బెల్టు షాపుల్లో మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు. ఉల్లంఘించి మద్యం అమ్మి తే రూ. 25 వేలు, కొనుగోలు చేసిన వారికి రూ. 10 వేల జరిమాన విధిస్తామన్నారు. పోలీసుల సహకారం అవసరమని కోరారు.

ఎమ్మెల్యే సునీతారెడ్డిపై కేసు

నర్సాపూర్‌ రూరల్‌: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందున నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రంజిత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిట్‌ విచారణను నిరసిస్తూ నర్సాపూర్‌లో ర్యాలీ తీయడంతో పాటు చౌరస్తా వద్ద బైఠాయించి రాస్తారోకో చేశారన్నారు. ఎన్నికల కోడ్‌, పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉన్నందున డిప్యూటీ తహసీల్దార్‌ స్వప్న ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌గౌడ్‌, సింగయ్యపల్లి గోపి, పట్టణ అధ్యక్షుడు పంబల భిక్షపతితో పాటు మరికొంతమంది బీఆర్‌ఎస్‌ నాయకులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

కాంగ్రెస్‌ సత్తా చాటుదాం

భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి

చేర్యాల(సిద్దిపేట): మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తాచాటుదామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి స్థానిక కొమ్మూరి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి 12 వార్డులకు అభ్యర్థులను ప్రకటించారు. 1వ వార్డు ఒగ్గు వెంకటమ్మ, 2వ వార్డు ముస్త్యాల తేజ, 3వ వార్డు కొమ్ము రా జేశ్వరి, 4వ వార్డు వంగ జయలక్ష్మి, 5వ వార్డు వెలుగల దుర్గయ్య, 6వ వార్డు ముస్త్యాల కృష్ణ, 7వ వార్డు పోతుగంటి ప్రసాద్‌, 8వ వార్డు సందుల సురేష్‌, 9వ వార్డు మామిడాల నాగరాజు, 10వ వార్డు తుమ్మలపల్లి లీల, 11వ వార్డు గుస్క వాసంతి, 12వ వార్డు షరీఫాబేగం పేర్లను ప్రకటించారు. ఎంపీ చామల, కొమ్మూ రి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలిచిన పల్లా బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. చేర్యాల మున్సిపల్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగరాలని, అందుకు ప్రతీకార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రతి అభ్యర్థి ఓటర్లందరినీ కలిసి ప్రభుత్వం అమలు చేస్తు న్న పథకాలను వివరించాలన్నారు. సమావేశంలో పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు.

సమయపాలన తప్పనిసరి 1
1/1

సమయపాలన తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement