పాఠశాలల్లో మూత్రశాలలు కరువు
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న
ఎంపీ రఘునందన్‌రావు
రామాయంపేట(మెదక్)/చేగుంట/నర్సాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మూత్రశాలలు లేక విద్యార్థినులు ఇబ్బందులపాలవుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని అక్కన్నపేటలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కా రానికి కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలతో పాటు అంగన్‌వాడీ భవనాలు, మూత్రశాలలు నిర్మించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రభు త్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎంపీ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి, తొనిగండ్ల, దంతేపల్లి సర్పంచ్‌లు నవీన్‌గౌడ్, బాల్‌రాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములు, వెల్ముల సిద్దరాంలు పాల్గొన్నారు. అంతకుముందు వడియారం రైల్వేస్టేషన్‌లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్‌ను రైల్వే అధికారులతో కలిసి ఎంపీ ప్రారంభించారు. ప్రస్తు తం మేడ్చల్ నుంచి కామారెడ్డి వరకు డబుల్ లేన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను వడియారంలో నిలపడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షురాలు స్రవంతి, సర్పంచ్‌లు సాయికుమార్, సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుజాత తదితరులు పాల్గొన్నారు. అనంతరం నర్సాపూర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కో రారు. నర్సాపూర్ మున్సిపాలిటీని ఆశించిన స్థాయి లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ తదితరులు ఉన్నారు.


