బాలికల హక్కులను పరిరక్షిద్దాం
మెదక్ కలెక్టరేట్: ప్రతి కుటుంబానికి ఆడపిల్ల ఒక గిఫ్ట్ అని, బాలికల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. శనివారం బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని గురుకుల బాలికల పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్ల ఉన్న ప్రతీ ఇళ్లు ఎప్పుడూ సంతోషకరంగా ఉంటుందన్నారు. బాలికల హక్కుల రక్షణ కోసమే ఉజ్వల అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉజ్వల కమిటీలను ఏర్పాటు చేసి బాలికలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ‘బేటీ బచావో– డిజిటల్ హటావో’ అనే సందేశంతో బాలికలను డిజిటల్ దుర్వినియోగం నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. జిల్లాలో ఆడపిల్లలకే చదువుపై ఎక్కువగా ఆసక్తి ఉందన్నారు. వారికి సరైన నైపుణ్యాలను అందిస్తే ఆకాశమే హద్దుగా వారి భవిష్యత్ సాగుతుందన్నారు. మహిళలు, పిల్లలు ఎదుర్కొనే సమస్యలను ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. అనంతరం పలు అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులు, మహిళలకు మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ హేమాభార్గవి, ఆయాశాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ మహేందర్


