చట్టపరంగా న్యాయం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

చట్టపరంగా న్యాయం చేస్తాం

Feb 3 2026 9:45 AM | Updated on Feb 3 2026 9:45 AM

చట్టపరంగా న్యాయం చేస్తాం

చట్టపరంగా న్యాయం చేస్తాం

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రజావాణి ఫిర్యాదుదారులకు చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి ఫిర్యాదు లు స్వీకరించారు. బాధితులతో వ్యక్తిగతంగా మా ట్లాడి, వారి సమస్యలను పూర్తిగా తెలుసుకున్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, సంబంధిత పోలీస్‌ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని కేసుల విషయంలో సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్‌లో మాట్లాడి, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా పోలీస్‌ అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రజావాణి ద్వారా ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమై ప్రజల్లో పోలీస్‌శాఖపై నమ్మకం మరింత పెరిగిందని వివరించారు.

ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement