మెతుకుసీమను కేంద్ర బడ్జెట్‌ మరోసారి నిరాశపర్చింది. ఆదివారం పార్లమెంట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. జిల్లా పరిధిలో రైలు, రోడ్డు మార్గాలకు బడ్జెట్‌లో నూతనంగా ఎలాంటి కేటాయింపులు జరగలేదు. పర్యాటక ప్రగతి ఊసేలేకపోగా, ఆదాయ పన్న | - | Sakshi
Sakshi News home page

మెతుకుసీమను కేంద్ర బడ్జెట్‌ మరోసారి నిరాశపర్చింది. ఆదివారం పార్లమెంట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. జిల్లా పరిధిలో రైలు, రోడ్డు మార్గాలకు బడ్జెట్‌లో నూతనంగా ఎలాంటి కేటాయింపులు జరగలేదు. పర్యాటక ప్రగతి ఊసేలేకపోగా, ఆదాయ పన్న

Feb 2 2026 8:13 AM | Updated on Feb 2 2026 8:13 AM

మెతుకుసీమను కేంద్ర బడ్జెట్‌ మరోసారి నిరాశపర్చింది. ఆదివ

మెతుకుసీమను కేంద్ర బడ్జెట్‌ మరోసారి నిరాశపర్చింది. ఆదివ

● కొత్త రైలు, రోడ్డు మార్గాలు కరువు ● ఊసేలేని పర్యాటకం, కేంద్రీయ,నవోదయ పాఠశాలలు ● వేతన జీవులకు దక్కని ఊరట

● కొత్త రైలు, రోడ్డు మార్గాలు కరువు ● ఊసేలేని పర్యాటకం, కేంద్రీయ,నవోదయ పాఠశాలలు ● వేతన జీవులకు దక్కని ఊరట

జిల్లాలో చారిత్రక కట్టడాలు ఉన్నా, పర్యాటకరంగ అభివృద్ధికి పైసా కేటాయించలేదు. జిల్లా మీదుగా నాలుగు జాతీయ రహదారులు ఉన్నప్పటికీ, మెదక్‌ నుంచి వయా నర్సాపూర్‌ మీదుగా హైదరాబాద్‌ ఓఆర్‌ఓర్‌ పరిధిలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నా యి. ముఖ్యంగా నర్సాపూర్‌ ఫారెస్ట్‌ వద్ద రోడ్డు ఇరుకుగా ఉండటం, మలుపులు ఉండటంతో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారిని నాలుగు లేన్లుగా నిర్మించాలి. అలాగే మెదక్‌ రింగ్‌రోడ్డు అత్యవసరంగా నిర్మించాల్సి ఉంది. వీటి నిర్మాణాలకు బడ్జెట్‌లో నిధులు మంజూరవుతాయని ప్రజ లు ఎంతో ఆశగా ఎదురు చూసినా, నిరాశే మిగిలింది.

ఉన్నత విద్య.. అందని ద్రాక్ష

జిల్లాలో ఉన్నత విద్య ద్రాక్షలా మారింది. ఇక్కడి విద్యార్థులు హైదరాబాద్‌ లాంటి నగరాలకు పరుగు పెట్టాల్సి వస్తోంది. ఈ బడ్జెట్‌లో కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు ఏర్పాటవుతాయని ఆశించిన మెతుకుసీమ ప్రజల కల నెరవేరలేదు. నేటికీ ఇక్కడ పీజీ కళాశాల లేకపోవటంతో ఈ ప్రాంతం విద్యారంగంలో వెనుకబాటుకు గురైంది. అలాగే జిల్లావ్యాప్తంగా సుమారు 6 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం వీరికి సేవింగ్స్‌ గత పుష్కరకాలంగా రూ. 1.50 లక్షలు మాత్రమే ఉంది. ఈ బడ్జెట్‌లో దాని పరిమితి కనీసం మరో రూ. లక్ష పెంచినా ఉద్యోగులకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లింపుల్లో కొంత తప్పేదని ఉద్యోగులు ఎంతగానో ఆశగా ఎదురుచూశారు. అయితే వారి ఆశలు ఆవిరయ్యాయి.

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఊరట

బడ్జెట్‌లో దీర్ఘకాలిక వ్యాధుల నివారణ కోసం రాబోయే ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు కేంద్రం ప్రకటించటం వ్యాధిగ్రస్తులకు కొంత ఊరట కలిగించే అంశం. జిల్లాలో బీపీ వ్యాధిగ్రస్తులకు రూ. 99 వేలు, షుగర్‌ రూ. 55 వేలు కేన్సర్‌ బాధితులు 475 మంది చొప్పున మొత్తం 1,54,475 మంది ఉన్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు తగ్గింపు!

ఈవీ కార్లు, ద్విచక్రవాహనాల ధరల తగ్గింపు కోసం ఈ బడ్జెట్‌లో ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం పెరిగితే కాలుష్యం తగ్గటంతో పాటు వాహనదారులకు ఖర్చు నుంచి విముక్తి లభిస్తోంది. అలాగే సెల్‌ఫోన్‌ల ధరలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం సైతం ప్రజలకు కొంత లాభం చేకూరుస్తుందనే చెప్పవచ్చు. అలాగే బాలికలకు జిల్లాకో హాస్టల్‌తో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా షీ మార్ట్‌లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement