రౌడీ షీటర్లపై నిఘా
మెదక్‌జోన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి డీజీపీ శివధర్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా పోలీస్ అధికారులతో కలిసి హాజరయ్యారు. మున్సి పల్ ఎన్నికల చట్టాలపై రాష్ట్ర పోలీస్ లీగల్ అడ్వైజర్ ఏపూరి రాములు అవగాహన కల్పి ంచారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం తయారీ, నిల్వ, రవాణా, అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా చేపడుతున్న భద్రతా చర్యలు, బందోబస్తు ప్రణాళికలు, పోలీస్ బలగాల వినియోగంపై ఎస్పీ డీజీపీకి వివరించారు. ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేలా పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, రంగానాయక్, సీఐలు రాజశేఖర్‌రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌రనగర్(సిద్దిపేట): జిల్లాలోని అన్ని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతికి, అదేవిధంగా 7 నుంచి 10 వరకు ఖాళీలు ఉన్న సీట్లకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత కల్గిన విద్యార్థులు ఈ నెల 28 లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 9న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.


