ఇంటికి వెళ్లి.. బడికి తీసుకెళ్లి
కొల్చారం(నర్సాపూర్): మండల కేంద్రంలోని కేజీబీవీని డీఈఓ విజయ శుక్రవారం సందర్శించారు. ఈ సమయంలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పాఠశాలకు కొన్ని రోజులుగా గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థిని బడికి రాకపోవడంపై స్పందించి విద్యార్థిని ఊరైన పాపన్నపేటకు స్వయంగా వెళ్లారు. వెంటనే పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. అనంతరం ఆమె వెంట బాలికను కేజీబీవీకి తీసుకొచ్చారు. పాఠశాలకు విద్యార్థులు గైర్హాజరు కాకుండా చూడాలని అక్కడి అధికారులకు, ఉపాధ్యాయులకు సూచించారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు.


