బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
తూప్రాన్: తూప్రాన్ అభివృద్ధి సాధించాలంటే బీజేపీని గెలిపించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సోమవారం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. తూప్రాన్ మున్సిపాలిటీని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు పాలించారని, ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి చైర్మన్ పదవిని కట్టబెట్టాలని ఓటర్లను కోరారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. కేసీఆర్ తన సొంత నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మినహా ఇక్కడికి వచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఫౌంహౌస్‌కే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన అవినీతిమయంగా మారిందన్నారు. కార్యక్రమంలో బీ జేపీ నాయకులు దుర్గరాజు, వేణుగోపాల్, తాటి విఠల్, సురేశ్‌గౌడ్, నాగరాజు, అమర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు


