పటిష్ట బందోబస్తు: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

పటిష్ట బందోబస్తు: ఎస్పీ

Feb 9 2026 8:46 AM | Updated on Feb 9 2026 8:46 AM

పటిష్

పటిష్ట బందోబస్తు: ఎస్పీ

మెదక్‌ కలెక్టరేట్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11న జిల్లావ్యాప్తంగా పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. అనవసర గొడవలకు పాల్పడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా 4 మున్సిపాలిటీల్లోని 75 వార్డులకు గాను 150 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. అందులో 21 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సుమారు 1206 మందిని ముందస్తుగా బైండోవర్‌ చేసినట్లు వివరించారు. ఎన్నికల్లో తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు రూ.20,54,660 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనపై 6 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఉమ్మడి జిల్లా

వాలీబాల్‌ జట్టు ఎంపిక

శివ్వంపేట(నర్సాపూర్‌): తెలంగాణ 8వ అంతర్‌ జిల్లా వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనేందుకు అండర్‌– 21 యువతి, యువకుల జట్టును ఎంపిక చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రవీందర్‌చారి అదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 14న సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాథమిక పాఠశాల మైదానంలో జట్ల ఎంపిక ఉంటుందని, ఆసక్తి గల క్రీడాకారులు హాజరుకావాలని కోరారు. 2005 జనవరి 1వ తేదీ తర్వాత జన్మించి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 9603431003, 9849109338, 8008384850 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి

మెదక్‌ కలెక్టరేట్‌: కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు విసుగెత్తారని, ఈ ఎన్నికల్లో వారికి గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఉన్నప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని, బీఆర్‌ఎస్‌ను ఓడించి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమ లు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బట్టి జగపతి, వార్డు ఇన్‌చార్జిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులను

భద్రపరచండి

నర్సాపూర్‌ రూరల్‌: పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ పూర్తయినందున బాక్సులను కట్టుదిట్టమైన పోలీస్‌ భద్రత మధ్య కౌంటింగ్‌ కేంద్రానికి తరలించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఎన్నికల సిబ్బందికి సూచించారు. ఆదివారం నర్సా పూర్‌ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. అనంతరం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్‌ సెంటర్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

మద్యం దుకాణాలు బంద్‌

రామాయంపేట(మెదక్‌): మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 9వ తేదీ సా యంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు మున్సిపాటీల పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నా యి. ఈమేరకు ఎకై ్సజ్‌ ఈఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మెదక్‌ మున్సిపాలిటీ పరిధిలో ఐదు వైన్‌ షాపులు, రెండు బార్లు, నర్సాపూర్‌లో నాలుగు వైన్స్‌లు, ఒక బార్‌, తూప్రాన్‌లో ఐదు వైన్స్‌లతో పాటు ఒక బార్‌, రామాయంపేటలో మూడు వైన్స్‌లతో పాటు బార్‌షాపు మూతపడనున్నాయి. తిరిగి 11న సాయంత్రం 5 గంటల తర్వాత ఓపెన్‌ అవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు.

పటిష్ట బందోబస్తు: ఎస్పీ 1
1/3

పటిష్ట బందోబస్తు: ఎస్పీ

పటిష్ట బందోబస్తు: ఎస్పీ 2
2/3

పటిష్ట బందోబస్తు: ఎస్పీ

పటిష్ట బందోబస్తు: ఎస్పీ 3
3/3

పటిష్ట బందోబస్తు: ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement