మెదక్‌లో హంగ్
వైస్ చైర్మన్‌పై బీజేపీ గురి
మెదక్‌జోన్/మెదక్‌అర్బన్: మెదక్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు హంగ్‌కు దారితీశా యి. కమలం కీలకమై వికసించగా, బీఎస్పీ మద్దతు ఆపన్నహస్తంగా మారింది. అధికార కాంగ్రెస్ ఆశించిన ఫలితం సాధించకపోగా, కారు దూసుకెళ్లింది. కాగా అధికారం కైవసం చేసుకోవడానికి మద్దతు తప్పనిసరి అయింది. శుక్రవారం పట్టణంలోని వెస్లీ కాలేజీలో జరిగిన ఓట్ల లెక్కింపు అభ్యర్థుల్లో ఉత్కంఠను రేపాయి.
అడుగుదూరంలో మ్యాజిక్ ఫిగర్..
మున్సిపాలిటీలో 32 వార్డులుండగా బీఆర్‌ఎస్ 15 సీట్లు దక్కించుకొని అధికారానికి అడుగు దూరంలో నిలిచింది. కాగా అధికార కాంగ్రెస్‌కు 14 సీట్లు రాగా, బీజేపీ రెండు, బీఎస్పీ ఒక్క స్థానం దక్కించుకొని నిర్ణయాత్మక శక్తిగా ఎదిగాయి. కనీసం బీజేపీ మద్ద తు పొందితే అధికారాన్ని దక్కించుకోవచ్చని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అవసరం అయితే ఎక్స్ అఫీషియో ఓట్లతో అధికారం పొందాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇకబీఎస్పీ, బీజేపీ మద్దతుతో పాటు ఎమ్మెల్యే, ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకొని పీ ఠం కై వసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది.
కమలంతో దోస్తీకి యత్నాలు
‘రాజకీయంలో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనేదీ జగమెరిగిన సత్యం. బీజేపీ అభ్యర్థుల మద్దతు కోసం ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బీజేపీ నాయకులతో మంతనాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీలో తనతో సంబంధాలున్న నాయకుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అవసరమైతే వైస్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు కూడా ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీ ఎస్పీ కౌన్సిలర్‌తో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఒకవేళ ఈ ముగ్గురి మద్దతు లభిస్తే పుర పీఠాన్ని కాంగ్రెస్ కై వసం చేసుకునే అవకాశం ఉంది. ఎలాగైనా మున్సిపాలిటీని కై వసం చేసుకోవడానికి కారు పార్టీ జోరుగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగినట్లు సమాచారం. వీరు బీజేపీ మద్దతు కూడగడితే మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటారు. అంతేకాకుండా ఆ పార్టీకి ఉన్న ముగ్గురు ఎక్స్ అఫీషియోల ఓటు హక్కుతో పుర పీఠాన్ని కై వసం చేసుకునే యత్నం చేస్తున్నారు.
ప్రత్యర్థుల అవసరాన్ని తమకు అనకూలంగా మలుచుకొని వైస్ చైర్మన్ పదవి పొందేందుకు కమలనాథులు స్కెచ్ వేసినట్లు తెలిసింది. బీజేపీ మద్దతిస్తేనే ఆ రెండు పార్టీలో ఎవరో ఒకరు పీఠాన్ని అధిష్టిస్తారు. అయితే వైస్ చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతిస్తామని బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు తెల్సింది.
ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్
కీలకంగా మారిన కమలం
బీఆర్‌ఎస్ 15, కాంగ్రెస్ 14, బీజేపీ 2, బీఎస్పీ 1
ఉత్కంఠ భ రితంగా సాగిన ఓట్ల లెక్కింపు


