పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Feb 14 2026 9:09 AM | Updated on Feb 14 2026 9:09 AM

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

శాస్త్రవేత్త డాక్టర్‌ జగదీశ్‌సింగ్‌

నర్సాపూర్‌ రూరల్‌: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని భారత ప్రభుత్వ భూ శాస్త్రాల మంత్రిత్వశాఖ సలహాదారు, శాస్త్రవేత్త డాక్టర్‌ జగదీశ్‌సింగ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సాపూర్‌ బీవీఆర్‌ఐటీలో రెండు రోజులుగా జరుగుతున్న అడ్వాన్స్‌ ఇన్‌ అట్మాస్పియర్‌, స్పేస్‌ ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ (ఏఈ ఆర్‌ఐఎస్‌ 2006) జాతీయ సదస్సు రెండో రోజు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వ్యవసాయం, చేపల వేట, ఇతర వనరుల వినియోగానికి సంబంధించిన సమస్యలు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రధాన ప్రయోగశాలలు, ఆయా సంస్థల నుంచి ఇప్పటివరకు 70 పరిశోధన పత్రాలు అందాయని తెలిపారు. రిమోట్‌ సెన్సింగ్‌, ఉపగ్రహ అనువర్తనాలు, మోడలింగ్‌, ఏఐ, భూమి వాతావరణ, సముద్ర అంతరిక్ష శాస్త్రాలలో డేటా విశ్లేషణ, డైనమిక్స్‌ హీరో సోల్స్‌, వాయు నాణ్యత, కాలుష్యం, మానవ ఆరోగ్యం వంటి వాటిపై పరిశోధనలు నిరంతరంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఆయా పరిశోధనల సంస్థల శాస్త్రవేత్తలు, బీఆర్‌ఐటీ కళాశాల ప్రిన్సిపాల్‌ సంజయ్‌ దుబే, డైరెక్టర్‌ లక్ష్మీప్రసాద్‌, డాక్టర్‌ సలావుద్దీన్‌, బాపిరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement