ప్రశాంతంగా కౌంటింగ్
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో శుక్రవారం మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ప్రశాంతంగా నిర్వహించామన్నా రు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.


