‘పేట’లో ఇరువర్గాల బాహాబాహీ
రామాయంపేట(మెదక్): చెదురుమదురు ఘటనలు మినహా రామాయంపేటలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఎనిమిది గంటలకు మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ తర్వాత ఊపందుకుంది. బీసీ కాలనీ ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ ఎదుట బారులు తీరారు. మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి, కోమటిపల్లిలో గిరిజనులు ట్రాక్టర్లలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏడో వార్డు పరిధిలోని గుల్పర్తిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరగగా పోలీసులు సకాలంలో చేరుకొని సముదాయించారు. ఒకటో వార్డులో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా, పోలీసులు వారిని వారించారు. ఉదయం 9 గంటల వరకు కేవలం 15 శాతం, 11 గంటల వరకు 40, మధ్యాహ్నం 1 గంట వరకు 61 శాతం ఓట్లు పోలయ్యాయి. కలెక్టర్ రాహుల్‌రాజ్ పట్ణణంలోని పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించారు.


