పుర పీఠంపై గురి!
మెదక్‌జోన్: మెదక్ ‘పుర’ పీఠంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లు గురి పెట్టాయి. ఎలాగైనా చైర్‌పర్సన్ స్థానాన్ని కై వసం చేసుకోవాలని రెండు పార్టీల నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కు రెండు సీట్లు కావాల్సి ఉండగా బీజేపీ మద్దతు కూడగడుతున్నారు. ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రోహిత్‌రావు, బీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు.
మరో రెండు సీట్లు అవసరం
మెదక్ బల్దియాలో మొత్తం 32 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 15, బీఆర్‌ఎస్ 14, బీజేపీ 2, బీఎస్పీ 1 గెలుచుకున్నాయి. కాగా మ్యాజిక్ ఫిగర్‌కు 17 సీట్లు అవసరం కాగా, బీఎస్పీ నుంచి గెలిచిన అభ్యర్థి భుజరంపేట అరుణ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. ఇక ఈ రెండు పార్టీల్లో చైర్మన్ పీఠం ఎవరు దక్కించుకోవాలన్నా, మరో రెండు సీట్లు అవసరం. దీంతో ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
బీజేపీ నేతలతో సంప్రదింపులు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు సమానంగా సీట్లు ఉండటంతో బీజేపీ కీలకంగా మారింది. ఆపార్టీలో గెలిచిన ఇద్దరు ఎవరికి మద్దతు ఇస్తే వారే పుర పీఠం కై వసం చేసుకుంటారు. కాగా ఎవరికి వారు బీజేపీ నేతలతో మద్దతు కోసం సంప్రదింపులు చేస్తునట్లు సమాచారం. అధిష్టానం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
స్థానికంగా ఓటు ఉంటేనే..
ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవాలంటే వారు స్థానిక మున్సిపాలిటీలో ఓటర్‌గా ఉంటేనే అర్హత ఉంటుందని, హైకోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల కమిషన్ నుంచి సర్క్యులర్ వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈలెక్కన బీఆర్‌ఎస్ తరఫున దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు వేసే అధికారం ఉంటుందా..? లేదా అంశం స్పష్టత కరువైంది.
ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న
కాంగ్రెస్, బీఆర్‌ఎస్
ఎక్స్‌ఆఫీషియో సభ్యులుగా
పోటాపోటీగా దరఖాస్తు
ఉత్కంఠ భరితంగా
మెదక్ బల్దియా ఎన్నిక


