900 మంది సిబ్బందితో బందోబస్తు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతరకు 900 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. శనివారం ఏడుపాయలలో ఆయన మాట్లాడుతూ.. భక్తుల రక్షణ కోసం పటిష్ట చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు అనుమానాస్పద వస్తువులను తాక వద్దని, అవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బారికేడ్లు, క్యూలైన్ల వద్ద సూచనలు పాటించాలన్నారు. ఆపత్కాల పరిస్థితుల్లో 100కు ఫోన్ చేయాలని చెప్పారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. షీ టీమ్స్ నిరంతర నిఘా పెడుతాయన్నారు. రాత్రి వేళల్లో పోలీసులు మఫ్టీలో తిరుగుతుంటారని, అవసరమైతే వారి సహయం తీసుకోవాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ జార్జ్, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.
ఎస్పీ శ్రీనివాస్‌రావు


