కౌంటింగ్‌లో ఆర్వోల పాత్ర కీలకం
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఆర్వోలు, సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ సూపర్‌వైజర్లు, మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం వెస్లీ కళాశాలలో స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ హాల్‌ను సందర్శించారు. ఈసందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. స్ట్రాంగ్ రూంకు మూడంచెల పోలీస్ భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. శుక్రవారం ఉదయం 5.45 గంటల వరకు ఆర్వో లు, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు కౌంటింగ్ కేంద్రంలో ఉండాలన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఓట్ల లెక్కింపు రౌండ్ల వారీగా, టేబుల్ వారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రంలోని సెల్‌ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు.
కలెక్టర్ రాహుల్ రాజ్


