ఘనంగా సంత్‌ సేవాలాల్‌ జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సంత్‌ సేవాలాల్‌ జయంతి

Feb 16 2026 8:23 AM | Updated on Feb 16 2026 8:23 AM

ఘనంగా

ఘనంగా సంత్‌ సేవాలాల్‌ జయంతి

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: హేతుబద్దీకరణ పేరుతో ప్రభుత్వం బడుల మూసివేత ఆలోచనలను విరమించుకోవాలని ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. సంగారెడ్డిలోని టీపీటీఎఫ్‌ కార్యాలయంలో విద్యా పరిరక్షణపై ఆదివారం జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 5 వేల పాఠశాలలను మూసి వేసే కుట్రకు పూనుకుందన్నారు. పాఠశాలలను మూసి వేయడాన్ని పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడమేనని అభివర్ణించారు. తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉంటేనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని, అందులో భాగంగానే పాఠశాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేసి పాఠశాలలో నెలకొన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తన వంతు బాధ్యతతో గుణ్మాతక విద్యను అందిస్తే విద్యార్థులు నమోదు పెరుగుతుందన్నారు. బడ్జెట్‌లో విద్యా రంగానికి తీరని అన్యాయం జరిగిందని, బడ్జెట్‌ తగ్గించడం ద్వారా విద్య ప్రైవేట్‌పరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కామన్‌ విద్యా విధానం కలగానే మిగిలిపోయిందని, ఉచితంగా నాణ్యమైన విద్యా, వైద్యం అందించినపుడే సమాజం బాగుపడుతుందని వివరించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ అసోసియేట్‌ అధ్యక్షుడు వై.అశోక్‌కుమార్‌, ఉపాధ్యాయ సంఘం నాయకులు సంజీవయ్య, రాంచందర్‌, సోమశేఖర్‌, లక్ష్మయ్య యాదవ్‌, అన్వర్‌, సాయిలు, నాసర్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు. కేతకీ.. శివోహం

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): మండల పరిధిలోని న్యాల్‌కల్‌, రుక్మాపూర్‌, గుంజోటి, ముంగి తదితర తండాల్లో ఆదివారం గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని గిరిజనులు ఘనంగా నిర్వహించారు. న్యాల్‌కల్‌ తండాలో సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయం ఆవరణలో గిరిజనులు యజ్ఞాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంగి ఆదిలక్ష్మి ఆశ్రమ పీఠాధిపతి దేవగిరి మహరాజ్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆశ్రమం నుంచి ప్రారంభమైన ర్యాలీ ముంగి మీదుగా న్యాల్‌కల్‌కు చేరుకుంది. న్యాల్‌కల్‌లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గిరిజన మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ సిద్దిలింగయ్యస్వామి, రుక్మాపూర్‌ సర్పంచ్‌ సురేశ్‌, నాయకులు ప్రవీణ్‌కుమార్‌, సక్కులాల్‌, బస్వరాజ్‌, యూనూస్‌ ఖాన్‌, కాశప్ప, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

బడుల మూసివేతను

విరమించుకోవాలి

ఝరాసంగం(జహీరాబాద్‌): శ్రీ కేతకీ సంగమేశ్వరాలయం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్ధరాత్రి 12 దాటగానే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రాతఃకాల పూజ అనంతరం దర్శనాలు ప్రారంభించారు. క్యూలలో గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. గత 41 రోజులుగా శివమాల ధరించిన భక్తులు ఇరుముడి సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ ఆవరణలోని అమృతగుండంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు.

పూజలు నిర్వహించిన మంత్రి దామోదర

మహాశివరాత్రిని పురస్కరించుకుని కేతకీలో మంత్రి దామోదర, ఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతాపాటిల్‌, మాజీ ఎంపీపీ హన్మంత్‌రావుపాటిల్‌, పాలక మండలి చైర్మన్‌ చంద్రశేఖర్‌ పాటిల్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఘనంగా సంత్‌ సేవాలాల్‌ జయంతి1
1/2

ఘనంగా సంత్‌ సేవాలాల్‌ జయంతి

ఘనంగా సంత్‌ సేవాలాల్‌ జయంతి2
2/2

ఘనంగా సంత్‌ సేవాలాల్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement