ఎక్స్‌అఫీషియోలు కీలకం | - | Sakshi
Sakshi News home page

ఎక్స్‌అఫీషియోలు కీలకం

Feb 15 2026 9:40 AM | Updated on Feb 15 2026 9:40 AM

ఎక్స్‌అఫీషియోలు కీలకం

ఎక్స్‌అఫీషియోలు కీలకం

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : హంగ్‌ ఫలితాలు వచ్చిన మున్సిపాలిటీల్లో ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు ఎంతో కీలకంగా మారింది. ఆయా మున్సిపాలిటీల్లో ఈ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా తమ పేరు నమోదు చేసుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆయా బల్దియాల చైర్మన్‌ ఎన్నికలో ఓటు వేసే అధికారం ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఈ ప్రజాప్రతినిధులు ఎవరెవరు ఏ మున్సిపాలిటీల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకున్నారనే విషయాన్ని పరిశీలిస్తే..మాజీ సీఎం కేసీఆర్‌ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ మున్సిపాలిటీలో ఎక్స్‌అఫీషియో సభ్యునిగా నమోదు చేసుకున్నారు. ఇదే మున్సిపాలిటీ ఉమ్మడి మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా నమోదు చేసుకున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ తన నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా అందోల్‌ –జోగిపేట మున్సిపాలిటీలో, మంత్రి పొన్నం ప్రభాకర్‌ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో, నారాయణఖేడ్‌ బల్దియాలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి (కాంగ్రెస్‌)లు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా పేరు నమోదు చేసుకున్నారు.

హంగ్‌ ఫలితాలు వచ్చిన మెదక్‌ మున్సిపాలిటీలో స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోహిత్‌రావుతోపాటు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు వెంకట్‌రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, సురేశ్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే హంగ్‌ ఫలితాలు వచ్చిన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ మున్సిపాలిటీలో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుతోపాటు, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిలు నమోదు చేసుకున్నారు. దుబ్బాకలో కొత్తా ప్రభాకర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌), నర్సాపూర్‌లో స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డిఎక్స్‌ అఫీషియో సభ్యులుగా పేరు నమోదు చేసుకున్నారు. ఎక్స్‌అఫీషియో సభ్యునిగా నమోదు చేసుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉందని బల్దియా వర్గాలు పేర్కొంటున్నాయి.

హంగ్‌ వచ్చిన చోట్ల..

ఎవరెవరు ఎక్కడ అంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement