చైర్‌పర్సన్‌ పీఠం బీఆర్‌ఎస్‌దే | - | Sakshi
Sakshi News home page

చైర్‌పర్సన్‌ పీఠం బీఆర్‌ఎస్‌దే

Feb 15 2026 9:40 AM | Updated on Feb 15 2026 9:40 AM

చైర్‌

చైర్‌పర్సన్‌ పీఠం బీఆర్‌ఎస్‌దే

నర్సాపూర్‌: మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠం బీఆర్‌ఎస్‌దేనని ఎమ్మెల్యే సునీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం గెలిచిన కౌన్సిలర్లతో కలిసి ఆమె మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చారు. ధృవీకరణ పత్రాలు తీసుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ప్రజల తీర్పును తాము శిరసావహిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. అధికారులతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేలా చేశారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు సైతం తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. చైర్మన్‌ పీఠం దక్కించుకుంటామని, తాము నిరంతరం ప్రజ ల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు చంద్రాగౌడ్‌, గోపి, శేఖర్‌, బాల్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డి, షేక్‌హుస్సేన్‌, భిక్షపతి, మన్సూర్‌, ప్రసాద్‌, జ్ఞానేశ్వర్‌, నాగరాజుగౌడ్‌, శ్రవణ్‌కుమార్‌, సద్దాం, సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

శివుని అనుగ్రహంతో

సంతోషంగా ఉండాలి

మాజీ మంత్రి హరీష్‌రావు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): పరమశివుని అనుగ్రహంతో ప్రజలంతా సంతోష ంగా ఉండాలని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం మహాఽశివరాత్రిని పురస్కరించుకొని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.

దుబ్బాక బీఆర్‌ఎస్‌ అడ్డా..

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అడ్డా అని మరోసారి మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక 17వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా గెలుపొందిన చాంద్‌మియా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక మొదటి నుంచి బీఆర్‌ఎస్‌కు అండగా ఉంటుందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో 11 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లుతో పాటు మరో ముగ్గురు సైతం తమ వారే గెలుపొందడం సంతోషకరమన్నారు. దుబ్బాక మున్సిపల్‌పై మరోసారి గులాబీ జెండాను ఎగరవేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు

గురుకుల విద్యార్థులు

నర్సాపూర్‌ రూరల్‌: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు నర్సాపూర్‌ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ కృష్ణకిషోర్‌ శనివారం తెలిపారు. ఈనెల 20వ తేదీ నుంచి 23 వరకు నల్గొండ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని చెప్పారు. పోటీలకు ఎంపికై న శైలజ, నిఖిత, శ్రావణి, అశ్విని, హిమజ, బాలురు జట్టు వర్షిత్‌, చరణ్‌, చేతన్‌, అరుణ్‌ను అభినందించారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ బసవరాజు, పీఈటీ లింగగౌడ్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పొన్నం పూజలు

హుస్నాబాద్‌/ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): హుస్నాబాద్‌ పట్టణం, అలాగే జిల్లా కేంద్రంలోనిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాలలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ జయకేతనం ఎగురవేయడంతో అమ్మవారికి శనివారం మొక్కులు సమర్పించుకున్నారు. ఈసందర్భంగా పొన్నం మాట్లాడు తూ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించడంతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆయన వెంట కార్యకర్తలు ఉన్నారు.

చైర్‌పర్సన్‌ పీఠం బీఆర్‌ఎస్‌దే 1
1/2

చైర్‌పర్సన్‌ పీఠం బీఆర్‌ఎస్‌దే

చైర్‌పర్సన్‌ పీఠం బీఆర్‌ఎస్‌దే 2
2/2

చైర్‌పర్సన్‌ పీఠం బీఆర్‌ఎస్‌దే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement