భారీ బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని వెస్లీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా కౌంటింగ్ సెంటర్‌లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు కీలక సూచనలు చేశారు. కౌంటింగ్ సెంటర్‌లోకి ప్రవేశించే ప్రతి వ్యక్తిని కచ్చితంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడం, ఊరేగింపులు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.


