ఆటా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు | American Telugu Association Celebrates Womens day In America | Sakshi
Sakshi News home page

ఆటా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

Mar 12 2020 2:46 PM | Updated on Mar 12 2020 2:48 PM

American Telugu Association Celebrates Womens day In America - Sakshi

న్యూజెర్సీ : అమెరికన్‌ తెలుగు అసోషియేషన్‌(ఆటా) ఆధ్వర్యంలో మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా  రాయల్, అల్బర్ట్ పాలేస్, న్యూ జెర్సీ, అమెరికాలో మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాంలో దాదాపు 350 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు టామి మర్ఫీ (న్యూ జెర్సీ ప్రథమ మహిళ) ముఖ్య అతిధిగా విచ్చేసారు. వీరితో పాటు ట్రేసీ ఆర్మ్ స్ట్రాంగ్ (లా అటార్నీ), ఇందూ గోపాల్ (వైద్యురాలు) ముఖ్య వక్తలుగా విచ్చేసారు. (అంగరంగ వైభంగా మహిళా దినోత్సవ వేడుకలు)

సంప్రదాయ రీతిలో ముఖ్య అతిథుల మధ్య జ్యోతి ప్రజ్వనలతో చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఆటా అధ్యక్షులు పరమేష్ భీంరెడ్డి,  విమెన్స్ కమిటి చైర్ ఇందిరా రెడ్డి స్వాగత ప్రసంగం ఇచ్చారు. అనంతరం న్యూజెర్సీ ప్రధాన మహిళ టామి మర్ఫీ సభను ఉద్దేశించి మాట్లాడారు.. మహిళా సాధికారత గురించి, న్యూజెర్సీకి చెందిన వివిధ సాంఘీక కార్యకలాపాలలో భారతీయుల సహాయ సహకారల గురించి వివరిస్తూ ప్రసంగించారు. అలాగే లాయర్ అయిన ట్రేసీ ఆర్మ్ స్ట్రాంగ్... ఉపాధి చట్టం గురించి, సమానత్వపు హక్కుల గురించి వివరించారు. డాక్టర్ ఇందూ గోపాల్ స్త్రీ ఆరోగ్య విషయాలు వివరిస్తూ, ఆటా కార్య నిర్వాహక వర్గానికి, సభకి ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సందర్భంగా ఆటా బృందం ముఖ్య అతిథులైన టామీ మర్ఫీకి, ట్రేసీ ఆర్మ్ స్ట్రాంగ్‌తోపాటుడాక్టర్ ఇందుగోపాల్ గారికి సన్మాన సత్కారాలు చేసారు. ఆటా ప్రధానాధ్యక్షులు పరమేశ్ భీం రెడ్డి ఆటా సంస్థ గురించి అటు తెలుగు ఇటు స్థానిక కార్యకలాపల గురించి, సంస్థ సేవలు, విలువలు, మరియు జులై 2020 లో జరగబోయే ఆటా మెగా సంబరాలకు ( కాన్ఫరెన్స్ ) రావాల్సిందిగా అందరిని ఆహ్వానించారు. సంగీతం, నృత్యం, ఫాషన్ షో  వంటి  వినోదాత్మకమైన ఆటలు దాదాపు 3 గంటలపాటు సభ్యులని ఉత్తేజపరిచాయి. 

ఈ కార్యక్రమాన్ని ఆటా రీజనల్ డైరెక్టర్ రవీందర్ గూడూరు, రీజనల్ కో-ఆర్డినేటర్స్ ప్రవీ ణ్ ఆళ్ళ, శివాని అయితా మరియు విజయ నాదెళ్ళ సమన్వయంలో, ఇతర సభ్యులు, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, స్టాండింగ్ కమిటీ చెయిర్స్ సహాయ సహకారాలతో నిర్వహించారు. అధ్యక్షులు పరమేష్ భీం రెడ్డి, మాజీ అధ్యక్షులు సుధాకర్ పెరికారి, కోశాధికారి రవి పట్లోళ్ళ, ఉమ్మడి కార్యదర్శి శరత్ వేముల, ట్రస్టీస్ శ్రీని దర్గుల, రఘువీర్ రెడ్డి, పరుశురాం పిన్నపురెడ్డి, వినోద్ కొడూర్, విజయ్ కుందూర్, శ్రీకాంత్ గుడిపాటి, సోషల్ మీడియా చైర్ విలాస్ జంబుల, రీజినల్ రీజనల్ అడ్వైసర్స్ రమేష్ మాగంటి, రాజ్ చిలుముల, బిజినెస్ కమిటీ చైర్ సురేష్ రెడ్డి, రాం వేముల మొదలగువారు అందరు పూర్తి స్థాయిలో హాజరు అయ్యి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి విజయవంతం చేసారు. న్యూజెర్సీలోని ఇతర తెలుగు నాయకులు, ప్రముఖులు కూడా విచ్చేసి సభకి నిండుతనము కలిగించారు.

మహిళా కార్య నిర్వాహక సభ్యులు నందిని దర్గుల, స్వర్ణ భీం రెడ్డి, డాక్టర్ వసంత పెరికారి, అర్చన వేముల, శిల్పి కుందూర్, మాధవి అరువ, అనురాధ దాసరి, ఇందిరా సముద్రాల, మధవి గూడుర్, నిహారికా గుడిపాటి, భాను మాగంటి, దివ్య ఆళ్ళ, కవిత పెద్ది, చిత్రలేఖ జంబుల, శ్రీదేవి జాగర్లమూడి, శ్వేత నాగిరెడ్డి మొదలగు వారు పూర్థి స్తాయి స్వచ్చంధ సేవలు అందించి సభని, సభికులని అలరించారు. స్థానిక మహిళలు వారి ప్రతిభలను వివిధ రకాలుగా సంగీత, నృత్య, ఫ్యాషన్ రంగాల్లో వేదికపైన ప్రదర్శించారు. చివరగా ఈ కార్యక్రమానికి సహాయాన్ని అందించిన దాతలకి, మీడియా వారికి, ఆహ్వానితులందరికి ఆటా నాయకత్వం ధన్యవాదాలు తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement