ఇండస్ట్రీ కళకళ.. లేడీస్‌ స్పెషల్‌  | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీ కళకళ.. లేడీస్‌ స్పెషల్‌ 

Published Thu, Mar 9 2023 3:44 AM

Ladies Special posters released on International Women's Day - Sakshi

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘లేడీస్‌ స్పెషల్‌’ అంటూ కొత్త పోస్టర్స్‌తో ఇండస్ట్రీ కళకళలాడింది. ఆయా చిత్రబృందాలు వారి సినిమాల్లోని కథానాయికల పో స్టర్స్‌ను రిలీజ్‌ చేశాయి. ఆ పో స్టర్స్‌ పై ఓ లుక్‌ వేయండి.  

ఫారిన్‌ అన్విత 
ఫారిన్‌ వీధుల్లో ఎంచక్కా హ్యాపీగా వాక్‌ చేస్తున్నారు మిస్‌ అన్వితా రవళి శెట్టి. ఆమె సంతోషానికి గల కారణాలను వేసవిలో థియేటర్స్‌లో చూడాల్సిందే. అనుష్కా శెట్టి, నవీన్‌ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం వేసవిలో రిలీజ్‌ కానుంది. కాగా ఈ చిత్రంలో చెఫ్‌ అన్విత రవళి పాత్రలో అనుష్క నటిస్తున్నారు. అన్వి త కొత్త పో స్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.  

శకుంతల ప్రేమ 
ప్రముఖ కవి కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపోందిన చిత్రం ‘శాకుంతలం’. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. ఈ చిత్రంలోని సమంత కొత్త పో స్టర్‌ను రిలీజ్‌ చేశారు. అలాగే బుధవారం నుంచి సమంత ‘ఖుషి’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ప్రమాదానికి చేరువలో.. 
ఉమెన్స్‌ డే రోజున ‘మ్యాన్‌’ సినిమాను అనౌన్స్‌ చేశారు హన్సిక. క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌గా రూపోందు తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. మద్రాస్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇగోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘వేటాడాలి. లేకపో తే మరొకరు మనల్ని వేటాడతారు. ఒక నిజానికి మనం దగ్గరవుతున్నామంటే అర్థం ప్రమాదానికి కూడా చేరువ అవుతున్నట్లే లెక్క’’ అని ఈ సినిమా గురించి పేర్కొన్నారు హన్సిక.   

మిస్‌ భైరవి 
‘రామబాణం’ కోసం భైరవిలా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు డింపుల్‌ హయతి. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్‌ కాంబినేషన్‌లో రూపోందుతున్న ‘రామబాణం’లో డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్‌ లుక్‌ పో స్టర్‌ను రిలీజ్‌ చేసి, భైరవి పాత్రలో నటిస్తున్నట్లుగా వెల్లడించారు మేకర్స్‌. టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొ ట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం మే 5న విడుదల కానుంది.  

గీత సాక్షిగా.. 
నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపోందిన చిత్రం ‘గీత సాక్షిగా’. లాయర్‌ పాత్రలో చిత్రా శుక్లా నటించిన ఈ చిత్రకథ మరో తార చరిష్మా చుట్టూ తిరుగుతుంది. ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా రూపోందిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 22న రిలీజ్‌  కానుంది. ఈ చిత్రం నుంచి చిత్రా శుక్లా లుక్‌ని రిలీజ్‌ చేశారు. ఆంథోని మట్టిపల్లి స్క్రీన్‌ప్లే రాసి, దర్శకత్వం వహించారు. చేతన్‌ రాజ్‌ కథ అందించి, నిర్మించారు.  ఇవే కాదు..  మహిళా దినోత్సవానికి మరికొందరు తారల కొత్త పో స్టర్స్‌ కూడా విడుదలయ్యాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement