ఆ పదింటికి వందనం..

Countries That Give Hundred Percent Equal Rights With Men - Sakshi

ఆకాశంలో సగం.. అన్నింటా సమానం..  మహిళా దినోత్సవం వస్తే చాలు..మనం ఎప్పుడూ చెప్పుకునేది ఇదే.. నిజంగానే ఆకాశంలో సగమేనా? అన్నింటా సమానమేనా? దీనిపై తాజాగా ప్రపంచబ్యాంకు ‘వుమెన్, బిజినెస్‌ అండ్‌ ద లా’  పేరిట ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. 194 దేశాల లెక్క తీస్తే.. కేవలం పది దేశాల్లోనే స్త్రీలకు పూర్తిస్థాయిలో సమాన హక్కులను కల్పిస్తున్నారు. పురుషులతో సమాన హక్కులు అంటే ఇక్కడ నోటి మాటలా చెప్పడం కాదు.. వాటిని పరిరక్షిస్తూ.. ఆయా దేశాల్లో చట్టపరమైన, న్యాయపరమైన రక్షణ కూడా కలిగి ఉండటం. అంటే.. స్వేచ్ఛగా తిరగడం, తనకు నచ్చిన పనిని ఎంచుకునే హక్కు కలిగి ఉండటం, వివాహం విషయంలో స్వేచ్ఛ,  సమాన వేతనం, పింఛన్లు, వ్యాపార నిర్వహణ, ఆస్తిపాస్తులు కలిగి ఉండటం ఇలా చాలావాటికి సంబంధించి ఆయా దేశాల్లో చేసిన చట్టాలను ఈ నివేదిక తయారీలో పరిగణనలోకి తీసుకున్నారు.

2019 జాబితాలో చివరి స్థానంలో ఉన్న సౌదీ అరేబియా.. 2020కి వచ్చేసరికి చాలా మెరుగైన ర్యాంకును సాధించింది. అక్కడ కొత్తగా తెచ్చిన చట్టాలే ఇందుకు కారణమని సదరు నివేదిక పేర్కొంది. 2020 జాబితాలో యెమెన్‌(26.9%) చివరి స్థానంలో నిలిచింది. ఇంతకీ మహిళలకు వందకు వంద శాతం సమాన హక్కులు కల్పిస్తున్న ఆ పది దేశాలు ఏమిటో.. మిగతావాటి పరిస్థితి ఏంటో కొన్ని దేశాల వారీగా ఓసారి చూసేద్దామా..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top