International Women's Day 2021: సినిమాల్లో... సగమెక్కడ?

Sakshi TV Special discussion with four female technicians

వాళ్ళు... ఆకాశంలో సగం! అందరి జీవితాల్లోనూ సగం!! ప్రతి మనిషి జీవితానికీ మూలం వాళ్ళే! ప్రతి మగాడి విజయం వెనుకా వాళ్ళే!! కళలకు కేంద్రం వాళ్ళే! కలలకు అందమూ వాళ్ళే!! కానీ...   పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలకు దక్కాల్సిన స్థానం దక్కుతోందా? సినీ లోకంలో స్త్రీకి ప్రాధాన్యం లభిస్తోందా?

నలుగురు మహిళా టెక్నీషియన్లతో స్పెషల్‌ డిస్కషన్‌ ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు , మళ్లీ రాత్రి 11.30కు

‘మహానటి’ సినిమా చేసేప్పుడు ఈ సినిమాకు చెందిన యూనిట్‌లో 99శాతం మంది మహిళలే ఉన్నారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది

- అనీ మాస్టర్, కొరియోగ్రాఫర్‌

పాతికేళ్ళ క్రితం నేను ఫస్ట్‌ సినిమాల్లో జాయిన్‌ అవుతానన్నప్పుడు మా నాన్నగారు కాళ్లు విరగ్గొడతానన్నారు. ఇప్పుడైతే పరిస్థితులు మారాయి. స్త్రీల టీమ్‌ వల్ల సినిమాలో మెల్ల మెల్లగా ఫిమేల్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూ పెరుగుతుంది.

- సునీత తాటి, నిర్మాత

ఇప్పుడు మేం మహిళా సాంకేతిక నిపుణులుగా రాణిస్తున్నాం అంటే అందుకు భానుమతీ రామకృష్ణ వంటి తొలితరం వారు వేసిన పునాదులే కారణం. స్త్రీలు సినిమాల్లోకి వస్తే... మన ఇంట్లో వాళ్ళ కన్నా... ఎదురింటి, పక్కింటివాళ్ళ వల్లే  పెద్ద ప్రాబ్లమ్‌!

- చైతన్య పింగళి, రైటర్‌ అండ్‌ కో-డైరెక్టర్‌

ఒక మహిళా సాంకేతిక నిపుణురాలిగా నేను రాణిస్తున్నాను అంటే దానికి కారణం నా కుటుంబం నుంచి నాకు లభించిన సపోర్టే.

- మోనికా రామకృష్ణ ప్రొడక్షన్‌ డిజైనర్‌

- ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top