ఇరాన్‌లో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబీసీ హెచ్చరిక | US–Israel–Iran War Live Updates: March 16, 2026 | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబీసీ హెచ్చరిక

సైనిక సలహాదారుగా మొహ్సెన్ రెజాయీని

  • ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) సీనియర్ సభ్యుడికి కీలక పదవి
  • కమాండర్ ఇన్ చీఫ్‌(మొజ్తబా ఖమేనీకి)కు సైనిక సలహాదారుగా మొహ్సెన్ రెజాయీని నియామకం
  • ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ ఆదేశంతో నియామకం
     
2026-03-16 21:33:39

నెతాన్యాహు మరో వీడియో విడుదల

  • నెతాన్యాహు మరో వీడియో విడుదల
  • కాఫీ వీడియోపై విమర్శల వచ్చిన నేపథ్యంలో మరో వీడియో రిలీజ్‌ చేసిన నెతాన్యాహు
  • ప్రజలతో మాట్లాడుతున్న వీడియోను  ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన ఇజ్రాయెల్‌ ప్రధాని

 

 

2026-03-16 19:32:16

వేల సంఖ్యలో భారత విమానాల రద్దు

  • యుద్ధం కారణంగా 4,335 భారత విమానాలు రద్దు
2026-03-16 19:03:41

ఈ యుద్ధాన్ని ఎలా ముగిస్తామంటే..: ఇరాన్‌

  • ఈ యుద్ధాన్ని ఎంతవరకు తీసుకెళ్లడానికైనా సిద్ధం
  • మా శత్రువులకు మరోసారి మాపై దాడి చేయాలనే ఆలోచన రాకూడదు
  • అటువంటి భావన వారిలో కలిగించేలా చేశాక ఈ యుద్ధం ముగియాలి
  • ఇప్పటికే వారు పాఠం నేర్చుకున్నారనుకుంటున్నాను
  • ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అరఘ్చీ ప్రకటన
2026-03-16 18:27:59

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు హెచ్చరిక

  • ఇరాన్‌లో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబీసీ హెచ్చరిక
  • తమను సంప్రదించకుండా ఇరాన్ సరిహద్దులు దాటవద్దని ఎంబీసీ సూచన..
  • సరిహద్దులు దాటితే ఎన్‌కౌంటర్లు జరిగే ప్రమాదం ఉందని ఎంబసీ హెచ్చరిక..
  • ఇరాన్‌లో భారతీయుల కోసం ఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్లు
  • +98 912 810 9115, +98 912 810 9102, +98 912 810 9109, +98 993 217 9359.
2026-03-16 18:15:18

భారత్‌ చేరుకోనున్న నౌకలు

  • హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న 22 భారత నౌకలు
  • అవి త్వరలోనే భారత్ చేరనున్నాయి: పరిశ్రమ వర్గాలు 
  • వాటిలో 6 ఎల్పీజీ క్యారియర్లు, ఒక ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్
  • నాలుగు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు
  • ఒక రసాయన ఉత్పత్తుల ట్యాంకర్
  • మూడు కంటైనర్ నౌకలు, రెండు బల్క్ క్యారియర్లు 
     
2026-03-16 17:31:36

యుద్ధంలో పాల్గొనని దేశాలకు ఇరాన్‌ గుడ్‌న్యూస్‌

  • యుద్ధం చేయని దేశాలు హర్ముజ్ జలసంధిని వాడుకోవచ్చు 
  • నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలి
  • ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై ప్రకటన
2026-03-16 15:42:02

హర్మూజ దగ్గర భారత నౌకలు క్షేమం: కేంద్రం

  • హర్మూజ దగ్గర భారత నౌకలు క్షేమం: కేంద్రం
  • అన్ని రాష్ట్రాల్లో ఎల్పీజీ స్టాక్‌ ఉందన్న కేంద్రం
  • గృహ వినియోగదారులకు 100 శాతం ఎల్పీజీ సరఫరా
2026-03-16 15:34:33

దుబాయ్‌, ఫుజైరాలో ఇరాన్‌ దాడులు

  • దుబాయ్‌ ఎయిర్‌పోర్టు, ఫుజైరా ఇండస్ట్రియల్‌ ప్రాంతంలో ఇరాన్‌ దాడులు
  • డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్‌.. యూఈఏ అధికారుల ప్రకటన
2026-03-16 14:25:02

ఖతార్‌ నుంచి భారత్‌కు చేరుకున్న శివాలిక్‌ నౌక

  • భారత్‌లో తీరనున్న గ్యాస్‌ కష్టాలు 
  • ఖతార్‌ నుంచి భారత్‌కు చేరుకున్న శివాలిక్‌ నౌక  
  • ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధి దాటి  గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు శివాలిక్‌ నౌక చేరుకుంది.
  • షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ఎల్‌పీజీ ట్యాంకర్ నౌక శివాలిక్‌లో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్‌ టన్నుల ఎల్పీజీ గ్యాస్‌
  • ఖతార్‌లోని రాస్ లఫాన్ ఓడరేవు నుండి బయలుదేరిన శివాలిక్‌ హర్మూజ్‌ జలసంధి నుంచి ప్రయాణం 
  • ఇవాళ గుజరాత్‌ రాష్ట్రం కచ్ జిల్లాలోని ముంద్రా ఓడరేవుకు చేరుకున్న నౌక
  • రాస్ లఫాన్ నుండి బయలుదేరిన మరో నౌక  నందా దేవి ఇప్పటికే గుజరాత్ తీరానికి దూరంగా ఉంది. 
  • రేపు (మార్చి 17న) ఉదయం 6:30 గంటలకు గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందని అంచనా
  • ఈ రెండు నౌకలు కలిపి తీసుకున్న వస్తున్న ఎల్పీజీ గ్యాస్‌  92,700 మెట్రిక్ టన్నులు
  •  
2026-03-16 12:00:41

నెతన్యాహుకు,ట్రంప్‌కు మధ్య చెడిందా

  • ఇజ్రాయెల్‌కి అమెరికాకు చెడిందంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు
  • కథనాల్ని ఖండిస్తూ ట్రంప్‌ ప్రకటన 
  • నేను నేతన్యాహూతో గొడవ పడ్డానా? అలాంటిదేమీ లేదు  
  • మేము ఇద్దరం మంచి స్నేహితులం 
  • ఇదే మాట నెతన్యాహు చెబుతాడు
  • ఇరాన్‌పై దాడులను సంయుక్తంగా చేస్తున్నాం
  • నేతన్యాహూతో నా సంబంధం అసాధారణమని నేను చెప్పగలను 
2026-03-16 09:53:17

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత

  • యుద్ధ భూమిని తలపిస్తున్న దుబాయ్‌ ఎయిర్‌పోర్టు
  • ఎయిర్‌పోర్టుపై ఇరాన్‌ మెరుపుదాడులు 
  • మెరుపుదాడలుతో మూతపడ్డ దుబాయ్‌ ఎయిర్‌పోర్టు 
  • ఇతర దేశాల నుంచి వచ్చే విమానాల దారి మళ్లింపు
2026-03-16 09:24:24

‘అవును నేను కాఫీ కోసం మరణించా’అంటూ ఇరాన్‌పై సెటైర్లు

  • పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం
  • ఇరాన్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రాణాలు కోల్పోయారని ప్రచారం
  • నెతన్యాహు ప్రాణం తీస్తామని ఇరాన్‌ ప్రకటనతో బలపడ్డ వదంతులు 
  • వదంతులు,అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ నెతన్యాహు వీడియో విడుదల 
  • అవును నేను మరణించాను.. కాఫీ కోసం అంటూ వీడియోలో సరదాగా కామెంట్స్‌ 
  • నెతన్యాహుకు ఆరువేళ్లు ఉన్నాయంటూ ఇరాన్‌ అసత్య ప్రచారం
  • ఆ వీడియోలో తన చేతులను చూపిస్తూ ఇరాన్‌ చేస్తున్న ‘ఆరు వేళ్లు’ వాదనను తిప్పికొట్టిన నెతన్యాహు  
  • ఫేక్‌న్యూస్‌ను ఖండించిన ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం 
  • నేతన్యాహు సురక్షితంగా ఉన్నారని ప్రకటన 

 

 

2026-03-16 08:22:15

మొజ్తాబా అంతం అంత ఈజీ కాదు

  • శత్రు శేషం, రుణ శేషం, వ్రణ శేషం, అగ్ని శేషం ఉండకూడదంటారు
  • ఇరాన్‌ నూతన సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ విషయంలో ఇదే సూత్రాన్ని పాటిస్తున్న అమెరికా 
  • తండ్రి ఖమేనీ మాదిరిగానే మొజ్తబాను కూడా అంతం చేయాలని ప్లాన్‌
  • అయితే, అది అంత సులభం కాదని చెబుతున్న ఇరాన్‌ 
  • అందుకు కారణం ఒక్కటే. మొజ్తబా చుట్టూ ఉన్న అత్యున్నత రహస్య భద్రతా కమెండో విభాగం ‘నోపో’! 
  • పార్సీ భాషలోని ‘నిరోయే విజేహ్‌ పాస్దరాన్‌ వేలాయత్‌’ అర్ధం
  • తెలుగులో చెప్పాలంటే ‘పాలకులను కాపాడే ప్రత్యేక దళం’  
  • దేశం పట్ల అత్యంత అంకితభావం చూపడమే నోపో సభ్యుల ప్రాథమిక లక్షణం’
  • నోపో అరాచకాలకు పాల్పడుతోందని, మానవహక్కులను హరిస్తోందని అమెరికా ఆరోపణలు  
  • 2021లోనే నోపోపై ఆంక్షలు విధించిన అమెరికా
2026-03-16 07:07:43

ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌ యుద్ధం.. తెరపైకి ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌

  • ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ సంచలన వ్యాఖ్యలు
  • మరోసారి తెరపైకి 9/11 తరహా దాడులు 
  • ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లోని సభ్యులు భవిష్యత్తులో 9/11 తరహా దాడులకు తెగబడతారని సమాచారం ఉంది
  • దాడి చేసి ఆ నేరాన్ని మాపై నెట్టే ప్రయత్నం జరుగుతోంది
  • ఇరాన్‌ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తోంది
  • మా యుద్ధం అమెరికన్‌ ప్రజలతో కాదని స్పష్టం చేసిన అలీ లారిజాని
  •  ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శ అలీ లారిజానీ 
     
2026-03-16 06:59:47

దుబాయ్‌లో దాడులు.. ఖండించిన ఖతార్‌,సౌదీ

  • పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం
  • ఈ యుద్ధంలో దుబాయ్‌పై భీకర దాడులకు తెగబడ్డ ఇరాన్‌ 
  • దుబాయ్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో డ్రోన్‌ దాడులు చేసిన ఇరాన్‌ 
  • ఖండించిన సౌదీ,ఖతార్‌ దేశాలు  
2026-03-16 06:49:56
Advertisement
 
Advertisement
Advertisement