Live Updates
ప్రముఖ డేటా సెంటర్లకు ఇరాన్ హెచ్చరిక
ప్రముఖ డేటా సెంటర్లకు ఇరాన్ హెచ్చరిక
- అమెజాన్ డేటా సెంటర్‌పై దాడి తరహాలోనే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియాలపై కూడా దాడులు చేస్తాం
- ఈ డేటా సెంటర్లు ఐడీఎఫ్ బలగాలకు సాయం అందిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఇరాన్ హెచ్చరికలు
- మీపై మేము దాడులు చేయబోతున్నామనే ముందస్తు వార్నింగ్
- మా జాబితాలో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియాలతో పాటు ఐబీఎమ్, ఒరాకిల్ కూడా ఉన్నాయని ప్రకటన
లెబనాన్ పార్లమెంట్ భవనంపై దాడికి రెడీ: ఇజ్రాయెల్
- బీరూట్‌కు ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు
- సెంట్రల్ బీరూట్ టార్గెట్‌గా దాడులు చేస్తామని వార్నింగ్
- లెబనాన్ పార్లమెంట్ భవనాన్ని తక్షణమే ఖాళీ చేయాలి
- ఏ క్షణమైనా దాడులు చేస్తామన్న ఇజ్రాయెల్
- ఇప్పటివరకు బీరూట్ శివార్లకే పరిమితమైన దాడులు
- సురక్షిత పప్రాంతాలకు పరుగులు తీస్తున్న ప్రజలు
- లెబనాన్ పార్లమెంట్ భవనాన్ని తక్షణమే ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్
- ఏ క్షణమైనా దాడులు చేస్తామని వార్నింగ్
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేస్తాం: కేంద్రం
- గ్యాస్ కొరతతో భారత్‌లోని పలు నగరాల్లో హోటళ్ల మూసివేతలు
- పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
- కొంత మొత్తంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేస్తామని వ్యాఖ్య
- లబ్ధిదారుల గుర్తింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనన‍్న కేంద్రం
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా వార్నింగ్
- హోర్ముజ్ జలసంధి మూసివేతను ఒత్తిడి పెంచే సాధనంగా ఉపయోగిస్తాం
- గల్ఫ్, అరబ్, పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతాయి
- ఆయా దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు మూసివేయాలి: మొజ్తాబా
మొట్టమొదటిసారి సందేశం ఇవ్వనున్న మొజ్తాబా
- మొట్టమొదటిసారి సందేశం ఇవ్వనున్న ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ
- కాసేపట్లో మెసేజ్ ఇస్తారని మొజ్తాబా అధికారిక టెలిగ్రామ్ ఛానెల్లో ప్రకటన
- సుప్రీం లీడర్‌గా నియమితుడయ్యాక తొలిసారి అధికారికంగా ప్రకటన చేయనున్న మొజ్తాబా
- మెసేజ్ రికార్డు చేసి సందేశం ఇస్తారా.. లిఖితపూర్వక ప్రకటన ఇస్తారా? అన్న దానిపై నో క్లారిటీ
దేశంలో ఇంధన కొరత లేదు: హర్దీప్ సింగ్
- దేశంలో ఎల్పీజీ సిలిండర్లపై ఏర్పడిన సంక్షోభంపై లోక్‌సభలో దుమారం
- కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్న రాహుల్ గాంధీ
- పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష నేతల నిరసన
- కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి లోక్‌సభలో వివరణ
- ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఆందోళన అవసరం లేదని వివరణ
- దేశంలో ఇంధన కొరత లేదన్న హర్దీప్ సింగ్
- తగినంత క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని వ్యాఖ్య
భారత్-ఇరాన్ విదేశాంగమంత్రులుమూడుసార్లు చర్చలు
- హర్మూజ్ నుంచి భారత నౌకలకు అనుమతిపైవిదేశాంగ శాఖ స్పందన: రణధీర్ జైశ్వాల్
- ఇరాన్‌లో ఉన్న భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం
- టెహ్రాన్‌లోని ఎంబసీ ఇండియన్స్‌తో టచ్‌లో ఉంది
- భారత్-ఇరాన్ విదేశాంగమంత్రులు మూడుసార్లు చర్చలు జరిపారు
- భారత ఇంధన భద్రతపై జైశంకర్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు
ముంబైకి సౌదీ ఆయిల్ ట్యాంకర్ నౌక వచ్చేసింది..
- ముంబై చేరుకున్న సౌదీ ఆయిల్ ట్యాంకర్ నౌక
- లైబీరియాకు చెందిన నౌకలో క్రూడాయిల్ దిగుమతి
- యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్ దాటిన మొదటి నౌక
- 1.35 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ల దాడి
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై పలు డ్రోన్ల దాడి
- భౌతిక నష్టాన్ని మాత్రమే కలిగించింది
- పూర్తి సమన్వయంతో వ్యవహరించి సమస్యను పరిష్కరించిన అధికారులు
- కువైట్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ప్రకటన
బాలిస్టిక్ క్షిపణుల ధాటికి తుస్సుమంటున్న ఐరన్ డోమ్
ఇజ్రాయెల్‌పై క్షిపణులతో ఇరాన్ ముప్పేట దాడి
పలు బాలిస్టిక్ క్షిపణుల ధాటికి తుస్సుమంటున్న ఐరన్ డోమ్
ఇజ్రాయెల్ వ్యాప్తంగా పలు చోట్ల తీవ్ర నష్టం
ఇరాక్ చమురు పోర్టు కార్యకలాపాలు మూసివేత
బహ్రెయిన్, కువైట్, యూఏఈ, సౌదీ అరేబియాపై దాడులకు ఇరాన్ యత్నం
విదేశీ చమురు ట్యాంకర్లనూ లక్ష్యంగా చేసుకుంటున్న ఇరాన్
అప్రమత్తమై పలు జాగ్రత్తలు తీసుకుంటున్న ఇరాక్
చమురు పోర్టు కార్యకలాపాలను మూసివేసిన ఇరాక్
ఇజ్రాయెల్‌పై దాడులతో రెచ్చిపోతున్న ఇరాన్
- రామత్ గన్‌లోని పలు భవనాలపై ఇజ్రాయెల్ దాడులు
- బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిన ఇరాన్
- దాడులతో పూర్తిగా దెబ్బతిన్న భవనాలు
ఒమన్ పోర్టుపై ఇరాన్ దాడి
- ఒమన్ సల్ అల్హా పోర్టుపై దాడి చేసిన ఇరాన్
- ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
చమురు ధరలపై ఇరాన్ వార్నింగ్
- త్వరలో చమురు బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరుకుంటుంది
- ప్రపంచం దానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్
భారత నౌకలకు ఇరాన్ అనుమతి
- భారత జాతీయ జెండా చూసి అనుమతిచ్చిన ఇరాన్
- భారత్ వెళ్లే నౌకలకు అనుమతిచ్చిన ఇరాన్
- పుష్పక్, పరిమల్ అనే రెండు నౌకలకు అనుమతి
- ముడిచమురు, సహజవాయువు రవాణా అవుతున్నట్లు సమాచారం.
ఇరాన్ దాడిలో భారతీయుడు మృతి
- అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి
- మంటల్లో సేఫ్-సీ విష్ణు ఆయిల్ ట్యాంకర్ దగ్ధం
- ఇరాక్ తీరంలో ఉన్న నౌకపై దాడి
- ప్రమాదంలో భారతీయుడు మృతి
కొనసాగుతున్న ఇరాన్ దాడులు
- ఇజ్రాయెల్‌పై విరుచుకపడుతున్న ఇరాన్
- టెల్‌అవీవ్, హైఫా, జెరుసలెం, ప్రాంతాల్లో దాడులు
యుద్ధం ముగించేందుకు సిద్ధమైన ఇరాన్?
- యుద్ధం ముగించేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ మూడు షరతులు
- ఇరాన్ హక్కులను అంతర్జాతీయంగా గుర్తించాలని టెహ్రాన్ డిమాండ్
- యుద్ధ దాడులతో జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని ఇరాన్ షరతు
- భవిష్యత్తులో ఇరాన్‌పై దాడులు జరగవని హామీ ఇవ్వాలని అమెరికా, ఇజ్రాయెల్‌ను కోరింది
- ఈ మూడు షరతులు నెరవేరితే మాత్రమే యుద్ధానికి ముగింపు అంటున్న ఇరాన్
- మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రకటన
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మిసైల్ దాడులు కొనసాగుతున్నాయి
- యుద్ధంపై మధ్యవర్తిత్వానికి కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం
ఇరాన్‌పై యుద్ధం వేళ అమెరికా కీలక నిర్ణయం
- ఇరాన్‌పై యుద్ధం వేళ అమెరికా కీలక నిర్ణయం
- యుద్ధంతో పెరుగుతున్న చమురు ధరల పెరుగుదలను అరికట్టేలా చర్యలు
- పెట్రోలియం నిల్వల నుండి 172 మిలియన్ బారెళ్లను విడుదల చేయనున్న అమెరికా
- ప్రపంచ చమురు ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా చమురును విడుదల చేస్తుందని అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్
అమెరికాపై నేరుగా ఇరాన్ అటాక్?
- అమెరికాపై నేరుగా దాడికి సిద్ధమవుతున్న ఇరాన్?
- అంతర్జాతీయ జలాల నుంచి దాడి చేసే ప్లాన్
- ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సంచలన నివేదిక
- కాలిఫోర్నియా లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం
- గుర్తుతెలియని నౌకల ద్వారా అమెరికాకు చేరువగా
- సమీప తీరానికి చేరుకున్న తర్వాత డ్రోన్ దాడి
- ఇరాన్ ప్లాన్ చేస్తోందని తెలిపిన ఎఫ్‌బీఐ
ఒమన్‌లోని సలాలా ఓడరేవుపై ఇరాన్ డ్రోన్ దాడి
- ఒమన్‌లోని సలాలా ఓడరేవుపై ఇరానియన్ డ్రోన్ దాడి
- దాడిలో దెబ్బ తిన్న ఇంధన ట్యాంకులు
- కఠినమైన దురాక్రమణ చర్యగా అభివర్ణించిన ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ
13వ రోజు కొనసాగుతున్న భీకర యుద్ధం
- 13వ రోజుకు చేరిన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త యుద్ధం
- నిర్విరామంగా కొనసాగుతున్న భీకర యుద్ధంతో భారీ ఆర్థిక,ప్రాణ,ఆస్తినష్టం
- వెనక్కి తగ్గని ఇరు దేశాలు
- హార్ముజ్ జలసంధి, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో వాణిజ్య నౌకలపై కొనసాగుతున్న దాడులు
- ఏఐ టెక్నాలజీతో ఇరాన్‌లోని 5,500 కంటే ఎక్కువ లక్ష్యాలను ఢీకొట్టిన అమెరికా దళాలు
- లెబనాన్‌లో దాడులతో ఆశ్రయం కోల్పోయిన 8లక్షల మంది
ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ దాడులు
- ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ దాడులు
- లెబనాన్ నుంచి హెజ్‌బొల్లా రాకెట్ దాడులు
- టెల్ అవీవ్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ
- జెరూసలేం వరకు సైరన్ల మోత
- దక్షిణ ఇజ్రాయెల్‌లోనూ అలర్ట్


