స్వచ్ఛందంగా దేశం వీడితే 2,600 డాలర్లు బోనస్‌ | USA Offers 2600 Dollers Exit Bonus to Illegal Immigrants | Sakshi
Sakshi News home page

స్వచ్ఛందంగా దేశం వీడితే 2,600 డాలర్లు బోనస్‌

Mar 19 2026 6:18 AM | Updated on Mar 19 2026 6:18 AM

USA Offers 2600 Dollers Exit Bonus to Illegal Immigrants

వలసదారులను పంపేందుకు అమెరికా ఆఫర్‌

వాషింగ్టన్‌:  అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపించేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ సారథ్యంలోని అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా స్వచ్ఛందంగా అమెరికాను విడిచి స్వదేశం వెళ్లాలనుకుంటున్న అక్రమ వలసదారులకు ఆర్థిక ప్రో త్సాహాన్ని మరింత పెంచింది. భారత్‌ సహా ఇతర దేశాల నుంచి వచ్చిన లక్షలాది మంది అక్రమ వలసదారులు స్వదేశానికి వెళ్లడానికి ఉచిత విమాన ప్రయాణంతో పాటు 2,600 డాలర్ల నిష్క్రమణ బోనస్‌ అందిస్తోంది. 

ఈ మేరకు అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) విభాగం పోస్టర్లను ఎక్స్‌లో పోస్టు చేసింది. ముఖ్యంగా భారత్, చైనా, కొలంబియా దేశస్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.  గతంలో బహిష్కరణకు గురైన తర్వాత అమెరికాను విడిచి వెళ్లలేని వారిపై విధించిన  జరిమానాలతో సహా కొన్ని శిక్షలను కూడా ఈ పథకం కింద  మాఫీ చేయనున్నట్లు  డీహెచ్‌ఎస్‌ వెల్లడించింది. గతంలో బహిష్కరణకు గురైన తర్వాత అమెరికాను విడిచి వెళ్లని వారిపై విధించిన  జరిమానాలతో సహా కొన్ని శిక్షలను ఈ పథకం కింద  మాఫీ చేయనున్నట్లు  డీహెచ్‌ఎస్‌ వెల్లడించింది.

 ఈ పథకాన్ని ఒక ‘చారిత్రాత్మక అవకాశం’గా అభివర్ణించింది. నమోదు చేసుకుని, దేశం విడిచి వెళ్లేందుకు అర్హత పొందిన వారిపై ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీసీ) ఎలాంటి చర్యలు తీసుకోదని తెలిపింది.  ఈ ప్రక్రియలో నమోదు కావడానికి వలసదారులు కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ (సీబీపీ) యాప్‌ను ఉపయోగించాలని డీహెచ్‌ఎస్‌ సూచించింది. జనవరి 2025లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 22 లక్షలకు పైగా అక్రమ వలసదారులు దీని ప్రయోజనాన్ని పొందారని వెల్లడించింది. ఒక వ్యక్తిని బలవంతంగా దేశ బహిష్కరణ చేయడానికి 18,245 డాలర్లు ఖర్చవుతోంది. 

2,600 డాలర్ల ప్రోత్సాహంతో సీబీపీ హోమ్‌ యాప్‌ ద్వారా స్వచ్ఛందంగా దేశం నుంచి వెళ్లడానికి అయ్యే ఖర్చు కేవలం 5,100 డాలర్లు అవుతుంది. దీనివల్ల 13వేల డాలర్లకు పైగా ఆదా అవుతుందని డీహెచ్‌ఎస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ‘అక్రమ వలసదారులు సీబీపీలో నమోదు చేసుకోవడం వల్ల వారు తమ పని, చదువు ఇతర వ్యక్తిగత విషయాలను ముగించుకుని చట్టబద్ధంగా తమ తిరుగు ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు’ అని తెలిపింది. గతేడాది మేలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు నిష్క్రమణ బోనస్‌గా 1,000 డాలర్లు అందించింది. కొత్త సంవత్సరం రాకముందే దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంటే ఈ బోనస్‌ను మూడు రెట్లు పెంచి 3,000 డాలర్లుగా చేసింది. ఈ సంవత్సరం జనవరిలో 2,600 డాలర్లుగా నిర్ణయించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement