‘నేను బ్రతికే ఉన్నాను మైక్‌’ : ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ | Israel PM Netanyahu Posts Video With US Envoy Amid Viral Death Rumours, Confirms He Is Alive And Well | Sakshi
Sakshi News home page

‘నేను బ్రతికే ఉన్నాను మైక్‌’ : ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ

Mar 18 2026 9:07 AM | Updated on Mar 18 2026 9:48 AM

Netanyahu posts video with US envoy amid viral death rumours

జెరూసలేం: ఇరాన్‌ జరిపిన దాడిలో తాను మరణించాడని సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ఖండిస్తూ వస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆరోగ్యం, ఉనికి గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహు స్వయంగా ఒక వీడియోను షేర్‌ చేశారు.

ఆ వీడియోలో ఆయన అమెరికా రాయబారి మైక్‌ హకబీతో కలిసి నడుస్తూ మాట్లాడుతున్నారు. ‘నేను బతికే ఉన్నాను మైక్‌’ అంటూ నెతన్యాహూ చమత్కరించారు. హకబీ కూడా సరదాగా స్పందిస్తూ, ‘మీ ఆరోగ్యం గురించి డొనాల్డ్‌ ట్రంప్‌ నన్ను పంపించారు. మీ క్షేమసమాచారం తెలుసుకోమన్నారు’ అని వ్యాఖ్యానించారు.

నెతన్యాహూ స్వయంగా వీడియో విడుదల చేసి తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను బతికే ఉన్నానని స్పష్టం చేశారు. హకబీతో సరదా సంభాషణలో ఆయన ‘అవును, మైక్‌. నేను బతికే ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు.

వీడియోలో సరదా మాటల మధ్య ఇరాన్‌ నాయకత్వంపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల ప్రస్తావన కూడా వచ్చింది.  ఈ రోజు, నేను పంచ్‌ కార్డ్‌పై ఉన్న రెండు పేర్లను చెరిపేశాను అని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. మొత్తం మీద, ఈ వీడియోతో నెతన్యాహూ మరణం పుకార్లకు ముగింపు పలికారు. అయితే సోషల్‌ మీడియాలో ఆయనపై వస్తున్న అసత్య కథనాలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి.

నెతన్యాహూ మరణంపై సోషల్‌ మీడియాలో పుకార్లు మాత్రం ఆగలేదు. కేఫ్‌లో కాఫీ తాగుతున్న వీడియోలు, ప్రజలతో మాట్లాడుతున్న క్లిప్‌లు, చేతులు ఊపుతూ అభివాదం చేస్తున్న దృశ్యాలు ‘పాతవి. ఇదంతా ఏఐ సృష్టి ’అంటూ ప్రచారం చేస్తున్నారు. ‘ఆయన చేతిలో ఐదు వేళ్లు కాదు, ఆరు వేళ్లు ఉన్నాయి’ అంటూ వింత వాదనలు కూడా వైరల్‌ అవుతున్నాయి.  

 

Advertisement
 
Advertisement
Advertisement