
థాయ్ బ్యూటీ క్వీన్ సుపన్నీ నోయినోంతాంగ్(Suphannee Noinonthong) అలియాస్ బేబీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అందాల రాణి కిరీటం దక్కిన మరుసటిరోజే ఆమె అశ్లీల వీడియోలు ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చాయి. దీంతో నిర్వాహకులు ఆమె కిరీటాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే అందులో ఉంది తానేనని, తాను ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆమె తర్వాత వివరణ ఇచ్చుకుంది.
థాయ్‌లాండ్(Thailand)లో 76 ప్రావిన్స్‌కు విడివిడగా అందాల పోటీలు నిర్వహిస్తారు. ఆ 76 మంది బ్యూటీ క్వీన్లను ఒక దగ్గరికి తీసుకొచ్చి మళ్లీ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. అక్కడ నెగ్గిన వాళ్లను మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీకి పంపిస్తారు. అలా.. 27 ఏళ్ల సుపన్నీ(బేబీగా ఆమెకు పాపులారిటీ దక్కింది) ప్రాచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్ నుంచి అందాల భామ గుర్తింపు దక్కించుకుంది. అయితే సెప్టెంబర్ 20వ తేదీన ఆమెకు కిరీటం దక్కగా.. ఆ వెంటనే ఆమెకు సంబంధించిన నగ్న చిత్రాలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ-సిగరెట్లు తాగుతూ, అశ్లీల నృత్యాలు.. చేష్టలతో ఆ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో.. ఆ మరుసటిరోజే నిర్వాహకులు టైటిల్‌ను వెనక్కి తీసుకుని, ఆమెను డిస్‌క్వాలిఫై అయినట్లు ప్రకటించారు.
అయితే.. ఈ పరిణామాలపై ఆమె క్షమాపణలు తెలియజేసింది. ఆ వీడియోలో ఉంది తానేనని ఒప్పుకుంది. ఈ మేరకు నిర్వాహకులను, తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ ఉంచింది.
కరోనా టైంలో తన తల్లి జబ్బు చేసి మంచాన పడిందని, ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అలా అశ్లీల వెబ్‌సైట్‌కు పని చేయాల్సి వచ్చిందని తెలిపింది. అయితే అంత చేసినా తన తల్లిని ఎంతోకాలం బతికించుకోలేకపోయానని, అప్పటి నుంచి మళ్లీ అలాంటి వాటి జోలికి వెళ్లలేదని వివరణ ఇచ్చుకుంది. ఈ ఘటన తనకు విలువైన గుణపాఠం నేర్పిందన్న ఆమె.. జీవితంలో ఎలాంటి తప్పు చేయబోనంటూ వ్యాఖ్యానించింది. తాను బ్యూటీ క్వీన్ కిరీటం గెలిచిన తర్వాతే అవి బయటకు వచ్చాయని.. ఉద్దేశపూర్వకంగానే వాటిని బయట పెట్టిన వాళ్లను కోర్టుకు లాగుతానని ఆమె హెచ్చరించింది.
ఈ వివరణ తర్వాత.. పలువురు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు.. నిర్వాహకులను కలిసిన బేబీ తన టైటిల్ విషయంలో విజ్ఞప్తి చేసుకుంది. జాతీయ స్థాయిలో పోటీలకు అనుమతించాలని వేడుకుంది. ఈ తరుణంలో జరిగిన విచారణకు ఆమె హాజరు కాగా.. న్యాయనిపుణులు ఆమెను పలు అంశాలపై ఆరా తీశారు. అందాల పోటీల్లోని పాల్గొనే ముందు ఒప్పందంలోని ఓ క్లాజ్ ప్రకారం.. కంటెస్టెంట్లు అశ్లీల కార్యకలాపాలకు దూరంగా ఉన్నామనే కాలమ్‌పై సంతకం చేయాలి. ఒకవేళ అది అబద్ధమని తేలితే వాళ్లపై క్రిమినల్ చర్యలు ఉంటాయి. బేబీ తెలిసి కూడా ఆ కాలమ్‌పై సంతకం చేయడంతో.. ఆమెకు మూడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడే అవశకాం ఉందని న్యాయనిపుణులు తెలిపారు. దీంతో ఆమె అందరి ముందే లబోదిబోమంది. అయితే టైటిల్ వెనక్కి ఇచ్చే అంశాన్ని పునరాలోచన చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో ఆమె సగం సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.