కరూర్‌ కన్నీరు.. హృదయవిదారక దృశ్యాలు | Tears in Karur tragedy etched in every face Viral | Sakshi
Sakshi News home page

కరూర్‌ కన్నీరు.. హృదయవిదారక దృశ్యాలు

Sep 28 2025 12:29 PM | Updated on Sep 28 2025 12:42 PM

Tears in Karur tragedy etched in every face Viral

ఊపిరి సలపని పరిస్థితుల్లో ప్రాణాల కోసం పాకులాడిన యువత.. చేతులు జోడించి ప్రాణభిక్ష కోరుతూ ఆర్థించిన వృద్ధురాలు.. తన బిడ్డ కనిపించడం లేదంటూ ఓ తల్లి పడ్డ ఆవేదన.. ఆ పక్కనే పడి ఉన్న ఓ చిన్నారి మృతదేహం.. ఇవన్నీ ఇప్పుడు కరూర్ విషాదాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాయి. 

కరూర్‌ వెలుచామైపురం టీవీకే ర్యాలీలో ఘోర విషాదం.. 39 మందిని బలిగింది. అనుమతించిన దానికంటే రెట్టింపు సంఖ్యల్లో జనం హాజరు కావడం, వాళ్లను పోలీసులు అదుపు చేయలేకపోవడం, ఆంబులెన్స్‌లకు దారి ఇచ్చే క్రమంలో తొక్కిసలాట జరిగిందని స్పష్టమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు టీవీకే పరిహారాలు ప్రకటించాయి. న్యాయపరమైన విచారణ జరుగుతోంది. అదే సమయంలో.. ఈ ఘటనకు సంబంధించిన ఘటన హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

చెల్లా చెదురైన చెప్పులు, టీవీకే జెండాలు అక్కడి పరిస్థితి తీవ్రతను అద్ధం పడుతున్నాయి. పరామర్శకు వచ్చిన నేతలకు తన రెండేళ్ల బిడ్డ విగతజీవిగా మారిందని చూపిస్తూ ఓ తండ్రి పెట్టిన రోదన అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement