
బాలీవుడ్ నటి నేహా ధుపియా తన ఫిట్‌నెస్‌రహస్యాలను, పలు రకాల వంటకాలను సోషల్‌మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలి, రెసిపీలను అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజగా 21 రోజుల చాలెంజ్ ప్లాన్‌ను షేర్ చేశారు. ఇద్దరు బిడ్డల తల్లి అయిన నేహా ధూపియా కొత్త వెల్‌నెస్ ఛాలెంజ్ నెటిజనులను బాగా ఆకర్షిస్తోంది.
నో మెడిసిన్స్, నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్.. కేవలం వంటగదిలో లభించే పదార్థాలతోనే మందులపై ఆధార పడకుండా సహజంగానే ఇన్‌ఫ్లమేషన్ దూరంఅంటూ ఆమె పోస్ట్ చేశారు.
నేహా ధూపియా తాజా పోస్ట్‌లో, నేహా ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడటానికి 21-రోజుల ఛాలెంజ్‌ను చేపట్టినట్లు వెల్లడించింది. అంతర్గత వాపును తగ్గించడంలో సహాయపడటానికి డైటీషియన్ రిచా గంగాని 21 రోజుల పాటు రోజువారీ హల్ది-అల్లం-నిగెల్లా సీడ్స్ మిశ్రమాన్ని సిఫార్సు చేశారు.
"21 రోజులు.. వన్ కమిట్‌మెంట్.. ఆరోగ్యకరమైన మీరు’’ అంటూ నేహా ధూపియా , రిచా గంగాని 21-రోజుల ఛాలెంజ్‌లో పాలుపంచుకోవాలని తన ఫ్యాన్స్‌ను ఆహ్వానించారు. ఎందుకంటే మీ శ్రేయస్సు కు ప్రయత్నం అవసరం అంటూ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. 21 రోజుల పాటు ఈ డ్రింక్ తాగి తమ అభిప్రాయాలను, ఫలితాలను షేర్ చేయాలని కోరారు.
ఈ డ్రింక్ కోసం కావాల్సినవి
ఒక చిన్న పచ్చి పసుపు ముక్క
1 క్యూబ్ పచ్చి అల్లం
5-7 నల్ల మిరియాలు
1 స్పూన్ నిగెల్లా విత్తనాలు (కలోంజి)
మీ దగ్గర MCT నూనె లేకపోతే
1 స్పూన్ కొబ్బరి నూనె లేదా
1 స్పూన్ నెయ్యి లేదా
1 స్పూన్ ఆలివ్ నూనె
వీటిన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసి మిశ్రమాన్ని ఐస్ క్యూబ్‌లలో ఉంచి ఫ్రీజ్ చేయాలి. వీటిని రోజుఒకటి చొప్పున ప్రతీ రోజు ఉదయం వీటిని వేడినీటిలో వేసుకుని సేవించాలి. ఇది ట్రెండీ సప్లిమెంట్ కాదని, ఇది మంచి కొవ్వు ఆమ్లాల మూలం అని రిచా లైవ్ చాట్‌లో పేర్కొన్నారు.
కాగా పసుపులో ఉండే కర్కుమిన్ , అల్లంలో ఉండే జింజెరోల్స్ వంటి సమ్మేళనాల కారణంగా పసుపు ,అల్లం చాలా కాలంగా సహజ మంట నివారణ మందులు పేరొందాయి. నల్ల మిరియాలు పసుపును బాగా గ్రహించడంలో సహాయపడతాయి. నిగెల్లా గింజలు యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. శరీరాన్ని ఒత్తిడి , నష్టం నుండి రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులైన నెయ్యి, కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె శరీరం ఈ పోషకాలన్నింటినీ వృధాగా పోకుండా గ్రహిస్తుందంటున్నారు వైద్యులు.
ఇన్‌ఫ్లమేషన్ కీళ్ల నొప్పులు, అలసట , దీర్ఘకాలిక వ్యాధుల వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం,వ్యాయామం లేకపోవడం లాంటి దీన్ని మరింత దిగజారుస్తాయి. అందుకే ఇప్పుడు చాలామంది నేహా లాగే దానిని నిర్వహించడానికి సహజ మార్గాల కోసం చూస్తున్నారు. ఇలాంటి వారి వారి శరీరం స్పందనల మీద ఆధారపడి ఉంటుందనేది గమనించాలి.