
సుదీర్ఘకాలం బతికి రికార్డులు సృష్టించి వృద్ధుల గురించి వార్తల్లో తెలసుకోవడమే గానీ నేరుగా చూసిన దాఖలాలు ఉండవు. కానీ అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు అలాంటి వృద్ధురాలిని కలవడమే కాదు, ఆమెతో మాటలు కలిపారు. అయితే ఒబామా- బామ్మతో సంభాషించిన మాటలు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఆయనేం మాట్లాడారంటే..
102 ఏళ్ల సుసాన్ అనే బామ్మని కలిసి ఆమెతో మాటలు కలిపారు. ఆమెను చూడగానే ఒబామా మీరు ఈ వయసులో ఇంత అందంగా కనిపించడంలోని సీక్రేట్ ఏంటని నేరుగా ప్రశ్నించారు. అందుకు ఆమె చిరునవ్వే సమాధానంగా నవ్వి ఊరుకుంది. ఆ తర్వాత ఒబామా నేను మిమ్మల్ని కలిసి ఏ అడగాలనుకుంటున్నానో మీకు తెలుసు అని నవ్వేశారు. అయినప్పటికీ అడుగుతున్నా..ఇంతటి వృద్ధాప్యంలోనూ అందంగా ఉన్న మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది .
అయితే ఇంతలా ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఏం తింటారు. బహుశా మీ డీఎన్‌ఏ మంచిదేమో అంటూ చమత్కిరించారు. దానికి ఆ వృద్ధురాలు సుసాన్ నవ్వుతూ.. ఆకుకూరలు, కార్న్ బ్రెడ్ అని మెల్లిగా చెప్పింది. ఆ వృద్ధురాలని పర్యవేక్షించే ఆమె కూడా ఆ సంభాషణలో జోక్యం చేసుకుంటూ..ప్రతి ఉదయం బేకన్ అని చెప్పింది. అందుకు ఒబామా ఒక్కసారిగా నవ్వేశారు. బహుశా ఇది డాక్టర్లు సూచన కదూ అని చమత్కరించారు.
చివరగా ఆ వృద్ధురాలు మీరు నన్ను చూడటానికి వచ్చినందుకు కృతజ్ఞుతురాలిని అని హృదరపూర్వకంగా అందామె. ఇక ఒబామా ఆమెకు వీడ్కోలు చెబుతూ..ఆమె చేతిని ముద్దుపెట్టుకున్నారు. అలాగే ఇలాంటి వ్యక్తులను కలవడం అస్సలు మిస్ అవ్వను అని ఆమెకు చెబుతూ నిష్క్రమించారు. అందుకు సంబంధించిన వీడియోకి ఒబామా "102 ఏళ్ల వయసులో నేను కూడా మీ అంత అందంగా ఉండాలని కోరుకుంటున్నా" అనే క్యాప్షన్‌ని జోడించి మరి పోస్ట్ చేశారు.
Susan, I hope I look as good as you at 102! pic.twitter.com/01CSm85krS
— Barack Obama (@BarackObama) September 22, 2025
(చదవండి: స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్)