'స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్‌ | Dussehra 2025: PM Modi Shares Devotional Song Goes Viral | Sakshi
Sakshi News home page

'స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్‌

Sep 23 2025 4:16 PM | Updated on Sep 23 2025 5:38 PM

Dussehra 2025: PM Modi Shares Devotional Song Goes Viral

దేవి నవరాత్రులతో యావత్తు దేశం ఆధ్యాత్మిక వాతవరణంతో అలరారుతోంది. ఎటు చూసిన దుర్గామాత నామస్మరణతో మారు మ్రోగిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రధాని మోదీ భారతదేశ ప్రజలను ఉద్దేశించి సోషల్‌ మీడియా పోస్ట్‌లో..శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. 

స్వచ్ఛ భక్తికి నెలవు ఈ తొమ్మిది రాత్రులు అని అన్నారు. పైగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఎవరితోచినట్లుగా వారు తమ భక్తి కొలదీ అమ్మను కొలుచుకుంటారు. అయితే వాటితోపాటు ఈ కీర్తనను కూడా వినండి అంటూ భక్తును ప్రోత్సహించారు. దీంతో ఒక్కసారిగా ఆ పాట నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.

ఈ నవరాత్రులు ఏడాదికి రెండుసార్లు జరుపుకోవడం ఆచారం. ఒకటి చైత్రమాసంలో జరుపుకునే శారద నవరాత్రులు కాగా, మరొకటి ఆశ్వీయుజ మాసంలో జరుపుకునే దుర్గా నవరాత్రులు. అయితే ఈసారి దుర్గమ్మను కొలుచుకునేందుకు సంగీతాన్ని కూడా జోడించండి అని భక్తులకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అంతేగాదు పండిట్‌ జస్రాజ్‌ పాటను షేర్‌ చేస్తూ ఈ తొమ్మిది రోజులు ఈ పాట వింటూ..అమ్మవారికి కృపకు పాత్రులకండి అంటూ సోషల్‌మీడియా పోస్ట్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. 

 

 

కాగా, మోదీ కూడా ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి దుర్గమ్మ వారిని ధ్యానిస్తానని గతంలో చెప్పారు. అలా చేయడం వల్ల తనలోని శక్తి మరింతగా జాగృతమై మంచి ఆలోచనలకు శ్రీకారం చుట్టడానికి వీలవుతుందని కూడా అన్నారు.  ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు కూడా భక్తిభావాన్ని పెంపొందించే ఇలాంటి పోస్టులనే మరిన్ని చేయమని మోదీని పోస్ట్‌లో కోరారు. ఇక పండిట్‌ పండిట్ జస్రాజ్ దుర్గమ్మపై పాడిన అందమైన పాట ఏంటంటే యాదేవి సర్వభూతేషు.. అంటూ సాగే రమ్యమైన పాట. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై క్లిక్‌ చేసి ఆస్వాదించండి మరి..!.

 

కీర్తనలు భగవంతునికి చేరువయ్యేలా చేస్తాయా?
కీర్తనలు భక్తి మార్గాన్ని చేరుకోవడంలో హెల్ప్‌ అవుతాయనేది పురాణ వచనం. నవవిధ భక్తుల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొన్నాయి పురాణాలు. అందుకే మోదీజీ ఈ శరన్నవరాత్రులను కీర్తనలు, భజనల సాయంతో అమ్మవారిని కొలుచుకుందామని పిలుపునిచ్చారు. 

రామదాసు, అన్నమయ్య, కబీర్‌ దాస్‌, మీరాబాయి వీరంతా కీర్తనలతో ఆ భగవంతుడుని వశం చేసుకోవడమే కాదు ఆయనకు ప్రీతీపాత్రులైన భక్తులుగా మారిపోయారు. అంతేగాదు ఆధ్యాత్మికత శక్తికి నెలవైనే ఈ భారతవని..ఎందరో విదేశీయులను తనవైపుకి తిప్పుకుని భక్తిమార్గంలో నడిచేలా చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి కూడా.  

(చదవండి: భారత్‌ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లైఫ్‌ ఇంతలా మారిపోయిందా..? విస్తుపోతున్న ఉక్రెయిన్‌ మహిళ)


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement