
సోషల్ మీడియా
సోషల్ మీడియాలో ‘తూమక్ తూమక్’ అనేది వైరల్ ట్రెండ్‌గా మారింది. కర్మ అనే టీచర్ చిన్న పిల్లలతో కలిసి వేసిన ‘తూమక్ డ్యాన్స్’ ఆహా అనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు 21 మిలియన్‌ల వ్యూస్ వచ్చాయి. టీచర్ వేసిన పాపులర్ ట్రెండ్ స్టెప్స్‌ను చిన్ని స్టూడెంట్స్ పర్‌ఫెక్ట్‌గా అనుసరించి ‘వారేవా’ అనిపించారు.
‘మీరు నమ్ముతారో లేదోగానీ నేను ఈ వీడియోను వందసార్లు చూసి ఉంటాను’ అన్నాడు ఒక యూజర్. ‘నా వయసు 26 సంవత్సరాలు. మీ స్కూల్‌లో విద్యార్థిగా మారవచ్చా?’ అని సరదాగా అడిగింది ఒక యూజర్. ప్లేబ్యాక్ సింగర్ నేహా బాషిన్ ‘జుట్టి మేరీ’ ఆల్బమ్ పాపులర్ అయింది. ఈ పాటలోని తూమక్ స్టెప్స్‌కు ఆన్‌లైన్ లోకం ఫిదా అయింది. గతవారం క్లాస్‌రూమ్‌లో చిన్న అమ్మాయి ఒకరు చక్కని హావభావాలతో వేసిన తూమక్ తూమక్ స్టెప్స్ వీడియో కూడా వైరల్ అయింది.