
బాలీవుడ్ నటి బానీ జె. కండలు తేలిన శరీరం, పోతపోసుకున్న టాటూల ఆకృతికి అభినయాన్ని జోడించి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.. స్టీరియో టైప్‌ను బ్రేక్ చేసింది. చండీగఢ్‌కి చెందిన ఆమె ఎమ్‌టీవీ వీడియో జాకీగా పనిచేస్తున్నప్పుడు వీజే బానీగా పాపులర్ అయ్యింది. అంతేగాదు బాలీవుడ్ బుల్లి తెర షో బిగ్‌బాస్ పదవ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిందామె. 2007లో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి విమర్శకుల మెప్పు పొందింది. అంతేగాదు ఆమె ఫిట్‌నెస్ అంటే ప్రాణం పెడుతుంది. ఖాళీ సమయాల్లో ఆమె గడిపేది జిమ్‌లోనే. ఫిట్‌నెస్ మోడల్ కూడా. అలాంటి ఆమె అంత అందమైన శరీరాకృతి కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటుందో బయటపెట్టింది. అది ఎవ్వరికైనా మంచి శరీరాకృతిని అందివ్వడమే కాదు, చర్మ సౌందర్యానికి మంచిదని చెబుతున్నారామె. ఇంతకీ అదెంటో తెలుసుకుందామా..!.
37 ఏళ బానీ జె కండరాలు, సన్నని శరీరాకృతికి పేరుగాంచిన నటి. కఠిన వ్యాయామ నియమావళి, ఆరోగ్యకరమైన ఆహారానికి పేరుగాంచిన బ్యూటీ ఆమె. ఇటీవల ఓ ఇంటర్యూలో తన ఫిట్‌నెస్ సీక్రెట్‌ని పంచుకుంది. తన గ్లామర్‌ని ఇనుమడింప చేసే రెసిపీని గురించి వెల్లడించింది.
తాను ఎక్కువగా ఇంట్లో వండిన భోజనమే తింటానని, ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌గా బోన్ బ్రోత్ తీసుకుంటానని అంటోంది. ఇది చర్మానికి చాలా మంచిదని, కండరాలను బలోపేతం చేస్తుందని చెబుతోంది.
బోన్ బ్రోత్ అంటే..
ఏంటీ వింత వంటకం అనుకోకండి. అదేనండి బోన్‌సూప్. చికెన్ లేదా మటన్ బోన్‌లను సుగంద్రవ్యాలతో కలిపి బాగా ఉడికించిన రసం లాంటి సూప్‌నే బోన్ బ్రోత్ అనిపిలుస్తారు. బానీ జె ఉపవాసం విరమించడానికి, ప్రతి ఉదయం దీన్ని తప్పనిసరిగా తీసుకుంటానని, అదే తన చర్మాన్ని సంరక్షణలో తోడ్పడుతుందని అంటోంది. అదీగాక తన శరీరాన్ని స్లిమ్‌గా కనిపించేలా చూపించడంలో దోహదపడుతుందని కూడా అంటోంది.
అతాగే రుచి కోసం ఈ సూప్‌లో కొన్ని ఇతర కూరగాయలు కూడా జోడిస్తామని అంటున్నారామె. ఫలితంగా ఆ సూప్‌లో వివిధ ఖనిజాలు, కొల్లెజెన్, అమెనో ఆమ్లాల వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతోంది. సేవించేటప్పుడూ పూర్తిగా వడకట్టి తీసుకుంటానని చెబుతోంది ఈ ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు బానీ జె. అంతేగాదు ఆమె తరుచుగా తన వ్యాయామా వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు.
ఆమె దాదాపు 80 కిలల బరువులు ఎత్తడం నుంచి మొదలు పెట్టి 150 కిలోల బరువులు వరకు ఎత్తుతారామె. కొన్ని చిన్న చిన్న ఆరోగ్యకరమైన ఆహారాలు పెద్ద మార్పునే తీసుకొస్తాయనడానికి ఈ నటి తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌నే ఉదాహారణ. అందుకే శరీరానికి సరిపడేది ఆరోగ్యకరమైన ఆహారాలను డైట్‌లో భాగం చేసుకుని మరింత సురక్షితంగా ఉండండి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి.
(చదవండి: హ్యూమన్ వాచ్': చూపుతిప్పుకోనివ్వని అమేజింగ్ ఆర్ట్..)