హాయ్‌ స్విగ్గీ.. వాట్‌ ఏ సడన్‌ సప్రైజ్‌! | Shashi Tharoor’s Poetic Praise for Idlis Gets Swiggy’s Delicious Surprise | Sakshi
Sakshi News home page

హాయ్‌ స్విగ్గీ.. వాట్‌ ఏ సడన్‌ సప్రైజ్‌!

Sep 30 2025 12:19 PM | Updated on Sep 30 2025 12:42 PM

Swiggy Sudden Surprises Shashi Tharoor with idlis Viral Full Details Here

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేరళ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌(Shashi Tharoor)కి ఫుడ్‌ డెలివరీ దిగ్గజం స్విగ్గీ సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఇడ్లీ గురించి కవితాత్వకంగా పోస్ట్‌ చేసిన మరుసటిరోజే.. వేడివేడిగా ఆయనకు ఆ బ్రేక్‌ఫాస్ట్‌ను అందించింది. ఊహించని ఈ పరిణామంతో ఆయన అవాక్కై.. ఆపై తేరుకుని ఆనందం వ్యక్తం చేశారు. 

శశి థరూర్‌ గారికి ఈ ప్రాంతంలోని ఉత్తమమైన ఇడ్లీలు అందించగలిగిన అవకాశం కలిగినందుకు మాకు అత్యంత ఆనందంగా ఉంది. రుచికరమైన ఆయన అభిరుచిని ఇవి తృప్తిపరిచాయని ఆశిస్తున్నాం అని స్విగ్గీ(Swiggy) తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది. దానికి ఆయన స్పందిస్తూ.. నా ఇడ్లీపై పోస్ట్‌కి స్పందనగా స్విగ్గీ ఇడ్లీలు పంపించి ఆశ్చర్యపరిచింది! ధన్యవాదాలు అంటూ బదులిచ్చారు. ఈ సందర్భంగా స్విగ్గీ సిబ్బందితో ఆయన దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 

 

ఇంతకీ శశిథరూర్‌ ఇడ్లీ గురించి ఏమన్నారంటే.. 
ఈ మధ్య ఓ నెటిజన్‌ ఇడ్లీ గురించి అభివర్‌నిస్తూ.. steamed regret అని ఓ పోస్ట్‌ చేశారు. అయితే దానికి స్పందిస్తూ శశి థరూర్‌ తనదైన ఇంగ్లీష్‌తో కవితాత్మకంగా ఓ కౌంటర్‌ పోస్ట్‌ చేశారు.  ఇడ్లీ.. ఓ మేఘం. ఓ తీయని కల.. అదొక కళాత్మక అద్భుతం అని అభివర్ణించారు. అంతేకాదు.. ఇడ్లీ వేస్తున్నట్లుగా ఏఐ ఫొటోను ఆయన షేర్‌ చేశారు.

మొత్తం భారతీయ సంస్కృతిలో ఇడ్లీని అత్యుత్తమ ఆహార సంపద అని పేర్కొన్న ఆయన.. ఠాగూర్‌, ఎంఎఫ్‌ హుస్సేన్‌, సచిన్‌ టెండూల్కర్‌ల ప్రతిభతో దానిని పోల్చారు. దీంతో పలువురు నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. ఇది కేవలం ఆహారంపై థరూర్‌ అభిప్రాయం మాత్రమే కాదని.. భారతీయత కలబోసిన గొప్ప ప్రశంస అని కామెంట్‌ సెక్షన్‌లో పోస్టులు పెడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement