
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని సోషల్ మీడియా ఇప్పుడు పాపం అంటోంది. అందుకు ఈజిప్ట్ శర్మ్ షేక్-ఎల్ నగర వేదికగా జరిగిన గాజా శాంతి సదస్సు కారణం. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె అందంగా గురించి బాహాటంగా వ్యాఖ్య చేయడంతో ఆమె కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించారు. అదే సమయంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆమె వ్యక్తిగత అలవాటు చేసిన సంభాషణ సోషల్ మీడియాకు ఎక్కింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలో ఓ మహిళను నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం.. ప్రమాదకరం. ఒకరకంగా అలా కామెంట్ చేయడం.. రాజకీయ ప్రస్థానాన్ని ముగించినట్లే. కానీ, నేను ఆ ప్రమాదాన్ని పట్టించుకోను. మీరు అందంగా ఉన్నావ్ అని చెబితే ఏమీ అనుకోవు కదా అంటూ వెనక్కి తిరిగి మెలోనీని చూస్తూ ట్రంప్ అన్నారు. దీంతో ఆమె సిగ్గుపడుతూ థ్యాంక్స్ చెబుతూ.. గుటకలు మింగారు. అలాగే..
Trump to Giorgia Meloni:
“In the U.S., if you tell a woman she’s beautiful, your political career is over. But I’ll take my chances. You won’t be offended if I say you’re beautiful, right?“
pic.twitter.com/YZEdsZjwSU— Spencer Hakimian (@SpencerHakimian) October 13, 2025
ఇంకోవైపు.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో జరిగిన సంభాషణా వైరల్ అవుతోంది. విమానం నుంచి దిగుతున్నప్పుడు నిన్ను చూశాను. బాగా కనిపిస్తున్నావు. కానీ నీ చేత పొగతాగడం ఆపించాలి అని అన్నారాయన. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమానుయేల్ మాక్రోన్ అది అసాధ్యం అంటూ జోక్ పేల్చారు. అయితే.. అది తనకు తెలుసని.. పొగ తాగడం ఆపేస్తే తాను నలుగురితో కలవలేనని అంటూ ఆమె నవ్వుతూనే బదులిచ్చారామె.
Erdogan to Meloni in Cairo:
“You look great but I have to get you to stop smoking”
🇮🇹🇹🇷 pic.twitter.com/f1CzICF1tq— Visegrád 24 (@visegrad24) October 13, 2025
ఇదిలా ఉంటే.. 48 ఏళ్ల మెలోనీకి స్మోకింగ్ అలవాటు ఉందనేది బాహాటంగా తెలిసిన విషయమే!. గతంలో తాను రాసిన పుస్తకాల్లోనూ ఆమె ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాదు.. ప్రపంచ నాయకులతో ఇంటెరాక్షన్ కోసం ఆ అలవాటు ఎంతో పనికి వచ్చిందని, ట్యూనీషియా అధ్యక్షుడు కైస్ సయీద్‌తో కలిసి స్మోక్‌కూడా చేస్తానని ఆమె తెలిపారు. మరోవైపు..
టర్కీని ధూమపాన రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎర్డోగాన్ కార్యచరణ రూపొందించారు. 2028 నాటికల్లా ఆ దేశాన్ని అలా తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నారు.
ఇదీ చూడండి: బాబోయ్.. ఇదేం భజన?: పాక్ పీఎం పొగడ్తలకు మెలోనీ రియాక్షన్