సాధారణంగాఉద్యోగులకు బాస్‌ను లీవ్ అడగాలంటే భయం. నిజాయితీగా ఉన్నకారణం చెబితే లీవ్ ఇస్తారా? లేదా అనేదాంతో ఏవో వంకలు చెప్పేస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగాలేదనో, ఇంట్లో వాళ్లకి బాలేదనో అలవోకగా అబద్ధాలు చెప్పేస్తారు. అంతేకాదండోయ్.. అల్ రెడీ చనిపోయిన, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలను మళ్లి మళ్లీ చంపేస్తూ లీవ్ పెట్టే ప్రబుద్ధులు కూడా చాలామందే ఉన్నారు. తాజాగా ఒక లీవ్ మెయిల్‌ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది.
ఇటీవలి కాలంలో కార్పొరేట్ కంపెనీల సీఈవో కొన్ని విచిత్రాలను, విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా గుర్గావ్‌కు చెందిన CEO ఉద్యోగి సెలవు అడిగిన తీరును షేర్ చేశారు. అతని నిజాయితీని మెచ్చుకున్నాడు. జెన్ జెడ్ (Gen Z) వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని నావిగేట్ చేసే విధానం తరచుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

గురుగ్రామ్‌లోని నాట్ డేటింగ్ కో ఫైండర్, సీఈవో జస్వీర్ సింగ్ తన కంపెనీ ఉద్యోగి లీవ్ కు సంబంధించిన ఒక మెయిల్ సెలవు స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. అందులో ఇటీవల బ్రేకప్ అయింది సార్, లీవ్ కావాలి.. పనిమీద దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాను. కొంత సమయం కావాలి. 28వ తేదీ నుంచి 8వ తేదీ వరకు (దాదాపు 11 రోజులు) సెలవు తీసుకోవాలని అనుకుంటున్నాను." అంటూ లీవ్ కోసం దరఖాస్తు చేశాడు. అతనికి లీవ్ మంజూర్ చేశారట. సింగ్ దీనిని తాను అందుకున్న "అత్యంత నిజాయితీగల సెలవు దరఖాస్తు"గా అభివర్ణించడం తోపాటు, జెన్ జెడ్ (Gen Z) ఏదీ దాచుకోదు అంటూ కమెంట్ చేయడం విశేషం.
ఉద్యోగి నిజాయితీని, దానికి మద్దతుగా నిలిచిన సీఈఓ నిర్ణయాన్ని ప్రశంసించారు నెటిజన్లు. మీరు మంచిబాస్ ఒకరు వ్యాఖ్యానించగా, మరొకరు Gen-Z ను మిలీనియల్స్‌తో పోల్చి వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. "జనరల్ జెడ్ బ్రేకప్ అయితే లీవ్ పెడతారు..కానీ మిలీనియల్స్ అలా కాదు వాష్‌రూమ్‌లో ఏడ్చుకుంటారు.. టార్గెట్లను ఫినీష్ చేస్తారు భావోద్వేగంతో స్పందించారు.
చదవండి: పాపం.. పిల్లి అనుకుని పాంపర్ చేశాడు, అసలు సంగతి ఇదీ!


