
ఒక భారతీయ మహిళ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురైంది. ఆ విషయాన్ని నెట్టింట షేర్ చేయడంతో..ఒక్కసారిగా భారతదేశ రిజర్వేషన్ విధానం హాట్‌టాపిక్‌గా మారింది. ఇదేలా రాజకీయ జిమ్మిక్కుగా మారి ఉన్నత విద్యావంతుల పాలిట శాపంగా ఎలా మారిందో ఓ యువతి ఇన్‌స్టా వేదికగా వాపోయింది.
అసలేం జరిగిందంటే..భారతదేశాన్ని విడిచి వెళ్లడం అనేది అంత ఈజీ కాదని, తప్పని పరిస్థితి అంటూ సోషల్‌మీడియా వేదికగా తన గోడును వెళబోసుకుంది. తాను ఉన్నత విద్యను భారత్‌లోనే అభ్యసించాలనుకున్నాని, తన మేథస్సు తన దేశ అభ్యున్నతి ఉపయోగపడాన్నేదే తన ఆకాంక్ష, లక్ష్యం కానీ విధిలేక దేశాన్ని విడిచి వెళ్తున్నానంటూ పోస్ట్‌లో కన్నీటి పర్యంతమైంది.
తనకు భారతదేశం అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడే మంచిగా స్థిరపడాలని కలలు కనేదాన్ని కానీ పరిస్థితులు మరో గత్యంతర లేకుండా చేసేశాయ్ అని ఆవేదనగా చెప్పుకొచ్చిందది. భారత్‌లో బలమైన విద్యా వ్యవస్థ ఉన్నప్పటికీ..ఇక్కడ ఉన్నత విద్యను అందుకోవడంలో అడగడుగునా ఎలా అండ్డంకులు ఎదురయ్యాయో వివరించింది.
తాను లక్నో విశ్వవిద్యాలయంలో చదివానని, అధిక మార్కులతో పట్టభద్రురాలినయ్యానని తెలిపింది. అలాగే కష్టపడి చదివి క్యాట్ ఎగ్జామ్ పాసయ్యానని చెప్పుకొచ్చింది. కానీ తనకు మంచి సంస్థలో చదివే అవకాశం లభించలేదని. సీట్లు చాలా తక్కువ స్కోరు చేసిన వారినే ఎలా వరించాయో కూడా తెలిపింది. వారందరికి మెరిట్ కారణంగా కాకుండా రిజర్వేషన్ ప్రాతిపదికన మంచి కాలేజ్ సీట్లు వచ్చాయని దాంతో తాను 2013లో రాజీపడి ఐఐఎంలో కాకుండా ఎఫ్‌ఎంఎస్‌లో చేరానని రాసుకొచ్చింది.
అలాగే 2025లో జీమ్యాట్‌లో ఉత్తీర్ణత సాధించినప్పుడూ కూడా జనరల్ కేటగిరీలో పరిమిత సంఖ్యలోస్లాట్‌లు ఉండటంతో మంచి సంస్థలో సీటు సంపాదించలేకపోయాను. అందువల్లే తాను విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని చెప్పుకొచ్చింది. ఇది తనొక్క వ్యథే కాదని, తనలాంటి ఎందరో టాపర్స్ ఆవేదన అని చెప్పుకొచ్చింది. జనరల్ కేటగిరీ అనేది ఆర్థికంగా అణగదొక్కబడిన సముహాలను వెనక్కి నెట్టేసి, రాజకీయ అంకగణిత సాధనంగా మారిందో వివరించింది.
న్యాయం కోసం వచ్చిన రిజర్వేషన్ ఎలా అన్యాయంగా రూపాంతరం చెందిందో చెప్పుకొచ్చింది. అందువల్లే తనలా దేశానికి సేవ చేయాలని కలలు కనే ప్రతిభావంతులంతా ఈ దారుణమైన వ్యవస్థ కారణంగా దేశానికి దూరంగా నెట్టబడుతున్నారంటూ ఆవేదనగా చెప్పింది. చివరిగా తాను ఏ కమ్యూనిటీకి వ్యతిరేకం కాదని కేవలం సమాన అవకాశం కోసం విజ్ఞప్తి, అన్నిటికంటే యోగ్యత, ప్రతిభను గుర్తించే వ్యవస్థ కోసం పడుతున్నా తపనే తన ఆవేదన అంటోంది.
అలాగే తనలా ఎవ్వరూ భారంగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నట్లు పోస్ట్‌లో రాసుకొచ్చింది. దాంతో ఒక్కసారిగా నెట్టింట భారతదేశ రిజర్వేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. విద్య, దాని అభివృద్ధికి సంబంధించిన సమగ్ర విధానంపై దృష్టిపెట్టాల్సిన తరుణం ఇది, లేదంటే మేధో ప్రవాహం తరలి వెళ్లిపోతుంది అంటూ పలువురు నెటిజన్లు అవేదనగా పోస్టుల పెట్టడం గమనార్హం.
(చదవండి: నింద, ఒత్తిడి, మౌనం..ఇంత ప్రమాదకరమైనవా? అంత దారుణానికి ఒడిగట్టేలా చేస్తాయా..?)