Arrest Lucknow Girl: ఎవడైతే నాకేంటి?.. ఎగిరెగిరి కొడుతూ ఓవరాక్షన్‌! మధ్యలో వచ్చాడని.. | Lucknow Girl Beating Cab Driver - Sakshi
Sakshi News home page

VIDEO: ఎవడైతే నాకేంటి?.. ఎగిరెగిరి కొడుతూ ఓవరాక్షన్‌! మధ్యలో వచ్చాడని..

Aug 2 2021 7:32 AM | Updated on Aug 2 2021 12:24 PM

Girl Beats Taxi Driver At Signal Tweeple Demands Arrest Lucknow Girl - Sakshi

సోషల్‌ మీడియా అంటే వైరల్‌ వీడియోలకు హబ్‌. ప్రేమ-పగ-దాడి.. అదీ ఇదీ అనే తేడా లేకుండా ఏదైనా హల్‌ చల్‌ చేస్తుంటుంది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో నడిరోడ్డుపై ఓ యువతి చేసిన రచ్చ వీడియో సోషల్‌ మీడియాను కుదిపిస్తోంది. #ArrestLucknowGirl హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

లక్నోలోని అవధ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌  దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఓ వ్యక్తిని నడిరొడ్డులో ఓ యువతి చితకబాదడం అందులో ఉంది. నాన్‌ స్టాప్‌గా అతన్ని కొడుతుంటే.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌తో సహా అక్కడున్నవాళ్లంతా ఆ తతంగం చూస్తూ ఉండిపోయారు. కారణం అడుగుతుంటే.. ఆ వ్యక్తి ఫోన్‌ను లాక్కుని మరీ పగలకొట్టింది ఆ యువతి. అంతేకాదు అడ్డొచ్చిన మరో వ్యక్తిని కాలర్‌ లాగి మరీ బాదేసింది.

ఈ టైంలో భారీ ట్రాఫిక్‌ జామ్‌ కాగా.. వెనకాల ఉన్న చాలామంది ‘ఆ అమ్మాయికి బుద్ధుందా?’ అంటూ వెనకాల నుంచి అరవడం వినొచ్చు. అయినా పట్టించుకోకుండా ఆ అమ్మాయి ఎగరి ఎగిరి మరీ ఆ వ్యక్తిని కొడుతూనే ఉంది. మధ్యలో వచ్చిన వ్యక్తిని ‘నీకేం పనిరా’ అంటూ మరీ బాదింది.  ఇక తనను ఢీకొట్టిన కారణంగానే ఈ పని చేసినట్లు ఆ యువతి అందులో మాట్లాడినట్లు ఉంది. 

ఇక ఈ వ్యవహారం సోషల్‌ మీడియాను కుదిపిస్తోంది. సరిగ్గా ఏ తేదీన జరిగిన ఘటనో తెలియదుగానీ.. ‘మేఘ్‌ అప్‌డేట్స్‌’ అనే ట్విటర్‌ పేజీ నుంచి ఈ వీడియో సర్క్యూలేట్‌ అయ్యింది. ఇక ఈ ఘటనలో ఆ యువకుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ అమ్మాయిని అరెస్ట్‌ చేయాలంటూ ట్వీట్లు చేస్తుండగా.. ట్విటర్‌ టాప్‌ ట్రెండింగ్‌లో హ్యాష్‌ ట్యాగ్‌ కొనసాగుతోంది. అసలేం జరిగింది అనేదానిపై లక్నో పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement