నడిరోడ్డుపై రెచ్చిపోయిన లవ్‌ బర్డ్స్‌.. బెడిసి కొట్టి.. | Lucknow Love Birds Trouble After Bike Stunt Viral | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై రెచ్చిపోయిన లవ్‌ బర్డ్స్‌.. వీడియో కాస్త బెడిసికొట్టి..

Jan 18 2023 9:15 PM | Updated on Jan 18 2023 9:21 PM

Lucknow Love Birds Trouble After Bike Stunt Viral - Sakshi

పిల్ల అడిగిందని రైడ్‌కు తీసుకుపోవడం తప్పు కాదు. కానీ, అతి చేష్టలకు పాల్పడితేనే.. 

లక్నో: సోషల్‌ మీడియాలో అడ్డదిడ్డమైన పోస్టులతో రెచ్చిపోతోంది ఇప్పటి యువత. లైకులు, షేర్ల కోసం ఇష్టానుసారం అప్‌ లోడ్‌ చేస్తోంది. అయితే ఫేమ్‌ అవ్వడం మాటేమోగానీ.. విమర్శలు ఎదుర్కోవడం పరిపాటిగా మారుతోంది. తాజాగా ఏపీ వైజాగ్‌లో ఘటన మర్చిపోకముందే.. అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసింది. అయితే.. 

లవర్‌ అడిగింది రైడ్‌కు తీసుకెళ్లాడట ఓ వ్యక్తి. కానీ, వాళ్లు అక్కడితోనే ఆగలేదు. రెచ్చిపోయారు..  బండి మీద వెళ్తూ.. కౌగిలింతలు, ముద్దులు అంతకు మించి అసభ్య చేష్టలకు పాల్పడింది ఓ ప్రేమ జంట. యూపీ లక్నో హజరత్‌గంజ్‌లో జరిగిన ఈ ఘటన.. సోషల్‌ మీడియా ద్వారా విపరీతంగా వైరల్‌ అయ్యింది. దారినపోయే కొందరు ఆ వీడియో తీసి ఇంటర్నెట్‌లో వదిలారు. ఇంకేం.. 

అడ్డూ అదుపు లేకుండా వైరల్‌ అయ్యిందా వీడియో. ప్రజల దృష్టిని ఆకర్షించడమే కాదు.. కాస్త చిరాకు తెప్పించింది ఆ వీడియో. వీడియో ఆధారంగా ఆ బండిని ట్రేస్‌ చేసిన లక్నో పోలీసులు.. బండి ఓనర్‌, ఆ వీడియోలోని వ్యక్తి అయిన విక్కీ శర్మను అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌, అసభ్య చేష్టలకుగానూ బండిని సీజ్‌ చేసి.. యువకుడిపై ఐపీసీ సెక్షన్‌ 294, 279 కింద కేసులు నమోదు చేశారు. ఇక వీడియోలో ఉంది మైనర్‌ కావడంతో.. ఆ అమ్మాయిని తల్లిదండ్రుల సమక్షంలో వార్నింగ్‌ ఇచ్చి వదిలేశారు పోలీసులు.

వీడియోల కోసం క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement