ఉపాధ్యాయ వృత్తి మహత్తర సేవ
ఫ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ : ఉపాధ్యాయ వృతి అనేది మహత్తర సేవ అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్‌లో జెడ్పీ హైస్కూల్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు యాట మధుసూదన్‌రెడ్డి పదవీ విరమణ సభ శనివారం రాత్రి జరిగింది. ఈ సభకు ఎమ్మెల్యే హాజరై ముధసూదన్‌రెడ్డి, మాదవి దంపతులను ఘనంగా సత్కరించి మాట్లాడారు. మధుసూదన్‌రెడ్డి మూడు దశాబ్ధాలకు పైనే ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నత భవిష్యత్ ఇచ్చారని కొనియాడారు. హెచ్‌ఎం కోదాటి రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చౌగోని రజిత, ఎంఈఓ మేక నాగయ్య, పీఎసీఎస్ మాజీ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్యశ్రీనివాస్, రిటైర్డ్ ఎంఈఓ గోలి చంద్రశేఖర్‌రెడ్డి, టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


