బెల్ట్‌షాపులు ఎత్తివేయాలని తీర్మానం | - | Sakshi
Sakshi News home page

బెల్ట్‌షాపులు ఎత్తివేయాలని తీర్మానం

Mar 5 2026 7:28 AM | Updated on Mar 5 2026 7:28 AM

గ్రామంలో మద్యం అమ్మకాలు సాగనివ్వం

ఏపూరు గ్రామంలో 18 వరకు బెల్ట్‌షాపులు ఉన్నాయి. నిరంతరం మద్యం అమ్మకాలతో ఎంతోమంది మద్యానికి బానిసవుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి. గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మకాలను నిలిపివేయాలని నిర్వాహకులకు నోటీసులు అందజేశాం. బెల్ట్‌షాపులను నిర్వహించమని వ్యాపారులు కూడా అంగీకార పత్రాలు అందజేశారు. గురువారం నుంచి బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు సాగకుండా చూస్తాం.

– పాలెం మహేష్‌గౌడ్‌, సర్పంచ్‌, ఏపూరు

నిర్వాహకులకు నోటీసులు

అందజేసిన ఏపూరు సర్పంచ్‌

చిట్యాల : మద్యానికి బానివుతున్న యువతను కాపాడేందుకుగాను చిట్యాల మండలంలోని ఏపూరు గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. ఆ గ్రామంలో విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్ట్‌ షాపులతో గ్రామంలోని యువతతో పాటు చుట్టుపక్కల పనిచేసే కార్మికులు మత్తులో జోగుతున్నారు. అంతేకాకుండా ఆ గ్రామానికి చెందిన పలువురు మద్యానికి బానిసలుగా మారి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గ్రామంలో నిర్వహిస్తున్న బెల్ట్‌ షాపులను వెంటనే మూసివేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం ద్వారా సర్పంచ్‌ నోటీసులు అందజేశారు. బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న వారందరితో గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్‌ సమావేశం నిర్వహించారు. బెల్ట్‌ షాపులను మూసివేసేందుకు నిర్వాహకులు అంగీకరించారు.

గతంలో బెల్ట్‌షాపులపై

దాడిచేసిన మహిళలు..

గతేడాది ఏపూరు గ్రామానికి చెందిన కూరకుల ధనుంజయ్య అనే యువకుడు బెల్ట్‌ షాపులో మద్యం తాగి బైక్‌ నడుపుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అప్పట్లో ఆ గ్రామ మహిళలంతా కలిసి గ్రామంలో బెల్ట్‌షాపులపై దాడులు చేశారు. గ్రామంలో బెల్ట్‌షాపులు ఎత్తివేయాలని ర్యాలీ నిర్వహించి.. ఎకై ్సజ్‌ శాఖతో పాటు పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రాలను అందజేశారు. దీంతో కొంతకాలం బెల్ట్‌షాపులను నిలిపివేసిన నిర్వాహకులు రెండు నెలల ఆనంతరం తిరిగి మద్యం అమ్మకాలు ప్రారంభించారు. అయితే.. మూడు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన మాదగాని వంశీ మద్యం మత్తులోనే బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఆ గ్రామస్తులు ఊరిలో బెల్ట్‌షాపులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. స్పందించిన సర్పంచ్‌ మహేష్‌గౌడ్‌ బెల్ట్‌షాపుల ఎత్తివేయాలని నోటీసులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement