మునుగోడు : బీసీలకు ఉద్యోగ, విద్య, రాజకీయాల్లో తగిన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న చేపట్టనున్న చలో ఢిల్లీకి పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. బుధవారం మునుగోడులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీల రిజర్వేషన్లు పెంచాలని పోరాడితే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం కేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేసిందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దానిని అమోదించకపోవడంతో బీసీలకు రిజర్వేషన్ అందని ద్రాక్షాగా మారిందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలని ఇటీవల రాష్ట్రానికి వచ్చిన రాహుల్‌గాంధీని కోరితే అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం బీసీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. సమావేశంలో బూడిద లింగయ్యయాదవ్, ఆనగంటి క్రిష్ణ, బూడిద మల్లికార్జున్, ఈదులకంటి కై లాస్, వీరమళ్ల కార్తిక్, గుర్జ నర్సింహగౌడ్, కర్నాటి వెంకటేషం, సత్యం, అశోక్, అనిల్ పాల్గొన్నారు.


