గాదె శ్రీనివాస్‌రెడ్డి చూపిన మార్గంలో నడవాలి | - | Sakshi
Sakshi News home page

గాదె శ్రీనివాస్‌రెడ్డి చూపిన మార్గంలో నడవాలి

Mar 2 2026 7:38 AM | Updated on Mar 2 2026 7:38 AM

గాదె శ్రీనివాస్‌రెడ్డి చూపిన మార్గంలో నడవాలి

గాదె శ్రీనివాస్‌రెడ్డి చూపిన మార్గంలో నడవాలి

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ : భూపోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరజీవి గాదె శ్రీనివాస్‌రెడ్డి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీనివాస్‌రెడ్డి 44వ వర్ధంతి సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. రైతు, కార్మిక హక్కుల కోసం సాగిన పోరాటంలో శ్రీనివాస్‌రెడ్డి పాత్ర నేటి తరానికి ఆదర్శమన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్‌ మల్లేష్‌, గాదె పద్మమ్మ, ప్రభాకర్‌రెడ్డి, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్‌, రాగిరెడ్డి మంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement