ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి
రామగిరి(నల్లగొండ) : ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. నల్లగొండ మండలంలోని రాములబండ గ్రామంలో సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన రథోత్సవంలో మంత్రి పాల్గొని గ్రామస్తులతో కలిసి రథాన్ని లాగారు. అనంతరం ఆయన గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాములబండలో సీతారామచంద్రస్వామి ఆలయ భూములను పరిరక్షించి.. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి అందేలా చూస్తానన్నారు. దోమలపల్లి, రాములబండ, కాకుల కొండారం, దీపకుంట చెరువులను నింపడంతోపాటు కాలువలకు లైనింగ్ పనులు పూర్తి చేస్తానన్నారు. రూ.10 కోట్లతో లిఫ్టు ఏర్పాటు చేశామని చెప్పారు. రూ.150 కోట్లతో నల్లగొండ నుంచి మునుగోడు వరకు డబుల్ రోడ్డుకు పనులకు టెండర్లు పిలుస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్ బురి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు గుమ్మల మోహన్‌రెడ్డి, వంగూరు లక్ష్మయ్య, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, సర్పంచ్ చామకూరి శంకర్‌గౌడ్, విగ్రహ దాత వంగాల కిరణ్‌కుమార్‌గౌడ్, బొబ్బలి ప్రకాష్‌రెడ్డి, గూడూరి ఉమారెడ్డి, బొంత వెంకన్న, పల్లె వెంకట్‌రెడ్డి, బొబ్బలి నరసింహారెడ్డి, వరికుప్పల రాజు, కష్ణంరాజు,మహేష్, బొబ్బలి వెంకట్ రెడ్డి,పల్లె కష్ణారెడ్డి, బొబ్బలి గణేష్ రెడ్డి, చామకూరి రామయ్య, చిలకరాజు భిక్షం, బొబ్బలి గణేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి


