3న ఆలయాలు మూసివేత
నార్కట్‌పల్లి : చంద్రగ్రహణం సందర్భంగా
ఈనెల 3వ తేదీన నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడాల రామలింగేశ్వర స్వామి దేవాలయం, గోపాలయపల్లి సమీపాన గల వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయాలు మూసివేస్తున్నట్లు ఆయా ఆలయాల ఈఓలు సల్వాది మోహన్‌బాబు, వెంకట్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ప్రధానాలయం, ఉపాలయాల్లో ప్రాంతఃకాల పూజల అనంతరం ఉదయం 7 గంటలకు ఆలయాన్ని మూసివేసి మరుసటి రోజు 4వ తేదీన సంప్రోక్షణ అనంతరం తెరిచి భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.
సంస్కృతికి ప్రతిబింబం ఆమనగల్లు జాతర
వేములపల్లి : ఆమనగల్లు గ్రామంలోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర ఆనాటి సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుందని డీఎస్పీ రాజశేఖరరాజు అనఆనరు.. ఆదివారం ఆయన జాతరను, క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలందరూ కులమతాలకు అతీతంగా జాతరను జరుపుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్, సర్పంచ్‌లు పిల్లల సందీప్, ఎల్లికట్టి భరత్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్‌లు శాలెం రాజు, స్వాతి, బంటు చొక్కయ్య గౌడ్, రావు ఎల్లారెడ్డి, అర్చకులు రెంటాల సతీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
న్యాయవాదులు
బాధ్యతగా మెలగాలి
రామగిరి(నల్లగొండ) : న్యాయవాదులు తమ విధులను సమర్థంగా నిర్వహిస్తూ.. బాధ్యతగా మెలగాలని న్యాయవాద పరిషత్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి అన్నారు. ఆది వారం నల్లగొండలో నిర్వహించిన న్యాయవాద పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. యువ న్యాయవాదులు నిరంతరం కేసులను చదువుతూ సీనియర్ న్యాయవాదుల సలహాలు సూచనలతో ముందుకు సాగాలని తెలిపారు. పేదల విషయంలో సేవా భావం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి సునీల్, కేంద్ర కమిటీ సభ్యుడు మేరెడ్డి నర్సింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్, కవిత, గౌరీష్, సొమంచి వెంకటేశ్వర్లు, చొక్కా ల నాగరాజు, న్యాయవాదులు నూకల నర్సింహారెడ్డి, నూకల సంధ్యారాణి, పల్లెబోయిన శ్యామ్‌సుందర్, రాంప్రసాద్, హరేరామకృష్ణ, రమేష్, నరేష్, ఏమిరెడ్డి సుమశ్రీ, వాణి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
3న ఆలయాలు మూసివేత


