వైద్యులు మానవత్వంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యులు మానవత్వంతో పనిచేయాలి

Feb 27 2026 4:15 AM | Updated on Feb 27 2026 4:15 AM

వైద్య

వైద్యులు మానవత్వంతో పనిచేయాలి

నల్లగొండ టౌన్‌ : వైద్యులు మానవత్వంతో పనిచేసి పేదలకు సేవలందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన అద్వితి –2026 వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైద్య కళాశాలలో అన్ని ఆధునిక సదుపాయాలు కల్పించామని, విద్యార్థులు సబ్జెక్టులతో పాటు, మానవత్వాన్ని కూడా నేర్చుకోవాలని సూచించారు. తెల్లకోటు.. బాధ్యతకు సింబల్‌ అన్నారు. కళాశాలలో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వైద్య కళాశాల విద్యార్థుల కోసం రెండు ఏసీ బస్సులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏఐజీ ఆస్పత్రి వైద్యుడు నాగిరెడ్డి.. ఈ వైద్య కళాశాలలో చదివిన పీజీ విద్యార్థులను పరిశోధన నిమిత్తం ఏటా 45 మంది చొప్పున తన ఆస్పత్రి లోకి తీసుకునేందుకు అంగీకరించారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఎంఓయూ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా బొట్టుగూడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ప్రతీక్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను రూ.కోట్లతో అభివృద్ధిద్ది చేశామన్నారు. నల్లగొండలో మరికొన్ని పాఠశాలలను కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్దుతానని చెప్పారు. రానున్న రోజుల్లో నల్లగొండను స్మార్ట్‌ సిటీగా, చేస్తానన్నారు. మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కాబోయే డాక్టర్లు గ్రామాల్లో పేదలకు సేవలు అందించాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ వైద్యులు రోగులను ప్రేమగా పలుకరించి వైద్యం చేయాలన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రి సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ అమీర్‌ అష్రఫ్‌ అలీ, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సత్యనారాయణ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్‌రెడ్డి, డాక్టర్లు పాల్గొన్నారు.

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

వైద్యులు మానవత్వంతో పనిచేయాలి1
1/2

వైద్యులు మానవత్వంతో పనిచేయాలి

వైద్యులు మానవత్వంతో పనిచేయాలి2
2/2

వైద్యులు మానవత్వంతో పనిచేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement