ఎంజీయూ రిజిస్ట్రార్‌గా కొప్పుల అంజిరెడ్డి | - | Sakshi
Sakshi News home page

ఎంజీయూ రిజిస్ట్రార్‌గా కొప్పుల అంజిరెడ్డి

Feb 27 2026 4:15 AM | Updated on Feb 27 2026 4:15 AM

ఎంజీయ

ఎంజీయూ రిజిస్ట్రార్‌గా కొప్పుల అంజిరెడ్డి

నల్లగొండ టూటౌన్‌ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) రిజిస్ట్రార్‌గా ఆర్థికశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌, ఆర్ట్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ డీన్‌ కొప్పుల అంజిరెడ్డి నియమితులయ్యారు. 2007లో ఎంజీ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరిన అంజిరెడ్డి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పేరుంది. అంజిరెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం సింగారం గ్రామం. రిజిస్ట్రార్‌గా నియమితులైన అంజిరెడ్డిని వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ అభినందించారు.

అంధ విద్యార్థులకు ప్రత్యేక లైబ్రరీ

రామగిరి(నల్లగొండ) : అంధ విద్యార్థుల కోసం నల్లగొండ జిల్లా గ్రంథాలయంలో ప్రత్యేకంగా డిజిటల్‌ లైబ్రరీ కార్నర్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ హఫీజ్‌ఖాన్‌ గురువారం ప్రారంభించారు. ఇందులో బ్రెయిలి పుస్తకాలు, ఆడియో బుక్స్‌, ఈ బుక్స్‌, స్క్రీన్‌ రీడర్‌ సాఫ్ట్‌వేర్‌తో కూడిన కంప్యూటర్లు సదుపాయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి బాలమ్మ, అనిల్‌కుమార్‌, కృష్ణమోహన్‌, నరసింహారెడ్డి పాల్గొన్నారు.

28న జాతీయ సైన్స్‌ దినోత్సవం

నల్లగొండ టూటౌన్‌ : జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సంబరాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల్లో సెమినార్లు, పరిశోధనలపై అవగాహన, సైన్స్‌ ప్రయోగాలు, వ్యాసరచన, క్విజ్‌ పోటీలు, పుస్తకాల ప్రదర్శన తదితర కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 9848578845 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

సెకండియర్‌ పరీక్షకు 286 మంది గైర్హాజర్‌

నల్లగొండ: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తెలుగు, ఉర్దూ, సంస్క్రతం, హిందీ పేపర్‌–2కు సంబంధించి జనరల్‌ ఒకేషనల్‌ విభాగాల్లో 13,117 మంది పరీక్షలు హాజరు కావాల్సి ఉండగా.. 12831 మంది పరీక్ష రాశారు. 286 మంది గైర్హాజర్‌ అయ్యారు. జనరల్‌లో 11,480 మందికి 215 మంది, ఒకేషనల్‌లో 1637 మందికి గాను 71 మంది గైర్హాజర్‌ అయ్యారు.

అవినీతి ఆరోపణలపై విచారించాలి

గట్టుప్పల్‌ : గట్టుప్పల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో వస్తున్న అవినీతి ఆరోపణపై విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ గురువారం ఆర్డీఓ శ్రీదేవిని ఆదేశించారు. మండలంలోని తేరట్‌పల్లి గ్రామంలో సర్వేనంబర్‌ 444లో అక్రమ రిజిస్టేషన్‌ చేశారని.. భూమి తక్కువగా ఉందని దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదని.. భూమి లేకున్నా ఆర్‌ఎస్‌ఆర్‌లో పెంచి అక్రమంగా రిజిస్టేషన్‌ చేశారని సోషల్‌ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ‘పైసలిస్తేనే.. ఫైల్‌ కదిలేది’ శీర్షికన గురువారం ’సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ స్పందించారు. వెంటనే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓ శ్రీదేవిని ఆదేశించారు. దీంతో తహసీల్దార్‌ రాములు తమ కార్యాలయంలో జరిగిన సంఘటనపై వివరాలను ఆర్డీఓకు పంపారు. ఆ వివరాలను ఆర్డీఓ పరిశీలించి శుక్రవారం కలెక్టర్‌కు నివేదికను పంపనున్నారు.

ఎంజీయూ రిజిస్ట్రార్‌గా కొప్పుల అంజిరెడ్డి1
1/2

ఎంజీయూ రిజిస్ట్రార్‌గా కొప్పుల అంజిరెడ్డి

ఎంజీయూ రిజిస్ట్రార్‌గా కొప్పుల అంజిరెడ్డి2
2/2

ఎంజీయూ రిజిస్ట్రార్‌గా కొప్పుల అంజిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement